ఆకాశం నీ సింహాసనం

పాట రచయిత: జోయెల్ జశ్వంత్ గుమ్మడి
Lyricist: Joel Jaswanth Gummadi

Telugu Lyrics


ఆకాశం నీ సింహాసనం
భూమి నీ పాదపీఠం (2)
సర్వోన్నతుడా సర్వాధికారి
అందుకో ఇల నా హృదయ వందనం
అల్ఫయు నీవే ఒమేగయు నీవే – (2)
మార్గము నీవే – జీవము నీవే       ||ఆకాశం||

పరలోక తెరపైట తొలగించగా
స్తుతి గీత పాటలు వినిపించగా (2)
పరిశుద్ద ఆత్ముడు నను తాకగా
రగిలింది నా మనస్సు ఒక జ్వాలగా       ||ఆకాశం||

నీ స్వరము ఉరుమై వినిపించగా
అదిరింది నా గుండె ఒకసారిగా (2)
నీ కిరణాలు మెరుపై నను తాకగా
వెలిగింది నా మనస్సు ఒక జ్యోతిగా       ||ఆకాశం||

భువిలోని సృష్ఠంత నీ మాటగా
దివిలోని ఊపిరి నీ శ్వాసగా (2)
పరలోక రాజ్యానికి నువ్వు దారిగా
వెలిసావు ధరపైన నా యేసుగా       ||ఆకాశం||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ప్రభు యేసు నా రక్షకా

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics


ప్రభు యేసు నా రక్షకా
నొసగు కన్నులు నాకు
నిరతము నే నిన్ను జూడ (2)
అల్ఫయు నీవే – ఒమేగయు నీవే (2)          ||ప్రభు యేసు||

ప్రియుడైన యోహాను పత్మాసులో
ప్రియమైన యేసు నీ స్వరూపము (2)
ప్రియమార జూచి బహు ధన్యుడయ్యె
ప్రియ ప్రభు నిన్ను జూడనిమ్ము (2)          ||ప్రభు యేసు||

లెక్కలేని మార్లు పడిపోతిని
దిక్కులేనివాడ నేనైతిని (2)
చక్కజేసి నా నేత్రాలు దెరచి
గ్రక్కున నిన్ను జూడనిమ్ము (2)             ||ప్రభు యేసు||

ఎరిగి యెరిగి నే చెడిపోతిని
యేసు నీ గాయము రేపితిని (2)
మోసపోతి నేను దృష్టి దొలగితి
దాసుడ నన్ను జూడనిమ్ము (2)             ||ప్రభు యేసు||

ఎందరేసుని వైపు చూచెదరో
పొందెదరు వెల్గు ముఖమున (2)
సందియంబు లేక సంతోషించుచు
ముందుకు పరుగెత్తెదరు (2)             ||ప్రభు యేసు||

విశ్వాసకర్తా ఓ యేసు ప్రభూ
కొనసాగించువాడా యేసు ప్రభూ (2)
వినయముతో నేను నీ వైపు జూచుచు
విసుగక పరుగెత్త నేర్పు (2)             ||ప్రభు యేసు||

కంటికి కనబడని వెన్నియో
చెవికి వినబడని వెన్నియో (2)
హృదయ గోచరము కాని వెన్నియో
సిద్ధపరచితివ నాకై (2)                 ||ప్రభు యేసు||

లోక భోగాలపై నా నేత్రాలు
సోకకుండునట్లు కృప జూపుము (2)
నీ మహిమ దివ్య స్వరూపమును
నిండార నను జూడనిమ్ము (2)          ||ప్రభు యేసు||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

HOME