ఊహించలేని కార్యములు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ఊహించలేని కార్యములు దేవుడు జరిగించినాడు
కానానులో మహిమను చూపి కార్యము జరిగించినాడు (2)
దంపతులను దీవించగా బంధువులు విచ్చేసినారు
ఘనమైన కార్యము తిలకించగా ఆత్మీయులే వచ్చినారు
ఆనందమే ఆనందమే ఈ పెళ్లి సంతోషమే
కళ్యాణము కమనీయము కళ్యాణ వైభోగము         ||ఊహించలేని||

ఒకరికి ఒకరు ముడి వేసుకొనే బంధం
ఒకరంటే ఒకరికి ప్రేమను పంచే తరుణం (2)
కలవాలి హృదయాలు ఒకటై
పండాలి నూరేళ్లు ఇకపై (2)
వెయ్యేళ్ళు వర్ధిల్లాలని ఇస్తున్నాము ఇవ్వాళ       ||ఊహించలేని||

దేవుని సముఖములో బ్రతకాలి మీరు
మీ జీవిత పయనం సాగాలి ఆ దేవునితో (2)
లోబడి ఉండాలి వధువు
ప్రేమను పంచాలి వరుడు (2)
దేవుడిచ్చే బహుమానం మీ కన్నుల పంట కావాలి       ||ఊహించలేని||

English Lyrics

Audio

ఊహించలేని మేలులతో నింపిన

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఊహించలేని మేలులతో నింపిన
నా యేసయ్యా నీకే నా వందనం (2)
వర్ణించగలనా నీ కార్యముల్
వివరించగలనా నీ మేలులన్ (2)       ||ఊహించలేని||

మేలుతో నా హృదయం తృప్తిపరచినావు
రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును (2)
ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా
స్తుతియింతును నీ నామమున్ (2)     ||ఊహించలేని||

నా దీనస్థితిని నీవు మార్చినావు
నా జీవితానికి విలువనిచ్చినావు (2)
నీ కృపకు నన్ను ఆహ్వానించినావు
నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు (2)   ||ఊహించలేని||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

 

 

HOME