ఊహలు నాదు ఊటలు

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics

ఊహలు నాదు ఊటలు
నా యేసు రాజా నీలోనే యున్నవి (2)
ఊహకందని నీదు ఆశ్చర్య క్రియలు (2)      ||ఊహలు||

నీదు కుడి చేతిలోన
నిత్యము వెలుగు తారగా (2)
నిత్య సంకల్పము
నాలో నెరవేర్చుచున్నావు (2)      ||ఊహలు||

శత్రువులు పూడ్చిన
ఊటలన్నియు త్రవ్వగా (2)
జలలు గల ఊటలు
ఇస్సాకునకు ఇచ్చినావు (2)      ||ఊహలు||

ఊరు మంచిదే గాని
ఊటలన్నియు చెడిపోయెనే (2)
ఉప్పు వేసిన వెంటనే
ఊట అక్షయత నొందెనే (2)      ||ఊహలు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

యేసయ్యా నీ మాటలు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురము
యేసయ్యా నీ మాటలు – రెండంచుల ఖడ్గము
నీ వాక్యమే దీపము…
నా త్రోవకు వెలుగై యున్నది
యేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురము
యేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు

కష్టములలో నష్టములలో
వ్యాధులలో నా వేదనలో (2)
ఆదరించును ఆవరించును
తీర్చి దిద్ది సరిచేయును
స్వస్థపరచును లేవనెత్తును
జీవమిచ్చి నడిపించును
యేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురము
యేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు

కష్టములలో నష్టములలో
వ్యాధులలో నా వేదనలో (2)
ఆదరించును ఆవరించును
తీర్చి దిద్ది సరిచేయును
స్వస్థపరచును లేవనెత్తును
జీవమిచ్చి నడిపించును (2)
యేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురము
యేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు

English Lyrics

Audio

HOME