విడువవు నన్నిక

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


విడువవు నన్నిక ఎన్నడైననూ
పడిపోకుండా కాయు రక్షకా (2)
పడిపోవు వారెల్లరిని
లేపెడి వాడవు నీవే ప్రభు (2)     ||విడువవు||

ప్రభువా నీకవిధేయుడనై
పలు మారులు పడు సమయములలో (2)
ప్రేమతో జాలి దీన స్వరముతో
ప్రియుడా నను పైకెత్తితివి (2)     ||విడువవు||

ఆదాము హవ్వలు ఏదెనులో
ఆశతో ఆజ్ఞ మీరినను (2)
సిలువకు చాయగా బలినర్పించి
ప్రియముగా విమోచించితివి (2)     ||విడువవు||

మా శక్తియు మా భక్తియు కాదు
ఇలలో జీవించుట ప్రభువా (2)
కొల్లగా నీ ఆత్మను నొసగితివి
హల్లెలూయా పాడెదను (2)     ||విడువవు||

English Lyrics

Audio

యవ్వనుడా

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics


యవ్వనుడా యవ్వనుడా
మాటిమాటికి ఏల పడిపోవుచున్నావు?
యవ్వనుడా యవ్వనుడా
నీ పాపజీవితంలో ఇంక ఎన్నాళ్ళు సాగెదవు?       ||యవ్వనుడా||

దుష్టుడు శోధనలకు గురిచేయుచుండగా
వాక్యమనే ఖడ్గముతో తరిమికొట్టుము (2)
యేసయ్యను స్వీకరించి వెంబడించుము (2)
అపజయమే ఎరుగక సాగిపోవుము (2)          ||యవ్వనుడా||

అనుదినము వాక్యముతో సరిచేసుకొనుము
ఇతరులకొక మాదిరిగా జీవించుము (2)
పాపమనే చీకటిలో ఉన్నవారిని (2)
నీ సాక్ష్యముతో వెలుగులోకి నడిపించుము (2)       ||యవ్వనుడా||

యవ్వనుడా యవ్వనుడా
ఇప్పటికైనా… యేసు పాదాల చెంతకి రావా

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME