దేవుడు దేహమును

పాట రచయిత: సాయారం గట్టు
Lyricist: Sayaram Gattu

Telugu Lyrics


దేవుడు దేహమును పొందిన దినము
మనిషిగా మారి ఇల చేరిన క్షణము (2)
తార వెలిగెను – దూత పాడెను
పరలోకనికి మార్గము వెలిసెను (2)
స్తుతుల గానములు పాడి పరవశించెదము
యేసు నామమునే చాటి మహిమ పరిచెదము (2)

దూత పలికెను భయము వలదని
తెలిపే వార్తను యేసే క్రీస్తని (2)
చీకటి తొలగెను రారాజుకు భయపడి
లోకము వెలిగెను మరణము చెరవిడి (2)
క్రీస్తు పుట్టెనని తెలిపి సంతోషించెదము
నిత్య జీవమునే చాటి ఘనత పొందెదము (2)       ||దేవుడు||

సృష్టి కారుడు అల్పుడాయెను
అది శాపము తీయ వచ్చెను (2)
పాపము ఎరుగని మనిషిగా బ్రతికెను
మానవ జాతికి మార్గమై నిలిచెను (2)
నమ్మి ఒప్పినను చాలు తొలగు పాపములు
పరము చేరుటకు మనకు కలుగు దీవెనలు (2)       ||దేవుడు||

English Lyrics

Audio

ప్రేమ లేనివాడు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ప్రేమ లేనివాడు పరలోకానికి అనర్హుడు
ప్రేమించలేని నాడు – తన సహోదరుని ద్వేషించే నరహంతకుడు (2)
ప్రేమ నేర్పించాలని నిన్ను – ఈ లోకానికి పంపించెను ఆ దేవుడు
ప్రేమ చూపించాలని నీకు – తన ప్రాణాన్ని అర్పించెను ప్రియ కుమారుడు
ప్రేమే జీవన వేదం – ప్రేమే సృష్టికి మూలం
ప్రేమే జగతికి దీపం – ప్రేమలోనే నిత్య జీవితం
ప్రేమే అంతిమ తీరం – ప్రేమే వాక్యపు సారం
ప్రేమే సత్య స్వరూపం – ప్రేమ ఒకటే నిలుచు శాశ్వతం         ||ప్రేమ లేనివాడు||

మంచి వాని కొరకు సహితము – ఒకడు మరణించుట అరుదు
పాపులకై ప్రాణమిచ్చిన – ప్రేమకు కట్టలేము ఖరీదు
ద్రోహియైన యూదానే ఆయన – కడవరకు విడువలేదు
అప్పగించువాడని తెలిసి – బయటకు నెట్టివేయలేదు
దొంగ అని తెలిసే ఉద్యోగం ఇచ్చాడురా
ధనము సంచి యూదా దగ్గరనే ఉంచాడురా
వెండి కొరకు తనను అమ్ముకోకూడదనేరా
చివరి వరకు వాడిని మార్చాలని చూసాడురా
ఇంత గొప్ప క్రీస్తు ప్రేమ కలిగియున్నవాడే
నిజ క్రైస్తవుడౌతాడురా
ప్రేమే దేవుని రూపం – ప్రేమే క్రీస్తు స్వరూపం
ప్రేమే కడిగెను పాపం – ప్రేమ జీవ నదీ ప్రవాహం       ||ప్రేమ లేనివాడు||

కాలు ఎదిగిపోతుందని – ఓర్వలేక కన్ను బాధపడదు
కంటిలోని నలుసు పడితే – సంబరంతో కాలు నాట్యమాడదు
చేయి లేచి చెవిని నరుకదు – పేగు గుండెను ఉరి తీయదు
వేలు తెగితే నోరు నవ్వదు – అసూయ అవయవాలకుండదు
సంఘమంటే యేసు క్రీస్తు శరీరమే సోదరా
మీరంతా అవయవాలు అతికి ఉండాలిరా
ఏ భాగం పాటుపడిన శిరస్సుకే మహిమరా
ఈ భావం బాధపడితే అభ్యంతర పరచకురా
ఇంత గొప్ప దైవ ప్రేమ కనుపరచిననాడే
క్రీస్తు నీలో ఉంటాడురా
ప్రేమే ఆత్మకు ఫలము – ప్రేమే తరగని ధనము
ప్రేమే పరముకు మార్గము – ప్రేమ వరము నిత్యజీవము           ||ప్రేమ లేనివాడు||

ఎంత గొప్పవాడైనా ప్రేమ లేకపోతే – లేదు ఏ ప్రయోజనం
ఎంత సేవ చేస్తున్నా ప్రేమ చూపకుంటే – గణ గణలాడే తాళం
వర్గాలుగా విడిపోయి విభజన చేస్తామంటే – ఒప్పుకోదు వాక్యం
పౌలెవరు పేతురెవరు పరిచారకులే కదా – క్రీస్తు యేసు ముఖ్యం
మారాలని మార్చాలని కోరేది ప్రేమరా
నిన్ను వలె నీ సహోదరులను ప్రేమించరా
ప్రేమించే వారినే ప్రేమిస్తే ఏం గొప్పరా
శత్రువులను సైతం ప్రేమించమన్నాడురా
ప్రేమ పొడవు లోతు ఎత్తు గ్రహియించినవాడే
పరలోకం వెళతాడురా
స్వార్ధ్యం లేనిది ప్రేమ – అన్నీ ఓర్చును ప్రేమ
డంభం లేనిది ప్రేమ – అపకారములే మరచును ప్రేమ
ఉప్పొంగని గుణమే ప్రేమ – కోపం నిలుపదు ప్రేమ
అన్నీ తాలును ప్రేమ – మత్సరమే పడనిది ప్రేమ
దయనే చూపును ప్రేమ – దరికే చేర్చును ప్రేమ
సహనం చూపును ప్రేమ – నిరీక్షణతో నిలుచును ప్రేమ
క్షమనే కోరును ప్రేమ – ద్వేషం చూపదు ప్రేమ
ప్రాణం నిచ్చిన ప్రేమ – దోషములే కప్పును ప్రేమ

English Lyrics

Audio

HOME