ఈ మరణము కాదు

పాట రచయిత: సాయారాం గట్టు
Lyricist: Sayaram Gattu

Telugu Lyrics

ఈ మరణము కాదు శాశ్వతము
పరలోకమే మనకు నివాసము (2)
యేసు తెచ్చెను మనకు రక్షణ
ఎంత అద్బుతము ఆ నిరీక్షణ (2)     ॥ఈ మరణము॥

జగతు పునాది వేయక ముందే
మనమెవ్వరో ఎవరికి తెలియక ముందే (2)
మనలను ఏర్పరచుకొన్న ఆ దేవుడు
తిరిగి తన దరికి మనల పిలిచే వేళ (2)
తిరిగి తన దరికి మనల పిలిచే వేళ      ॥ఈ మరణము॥

యేసు నామమును ఎరిగిన వారు
పాప శ్రమలకు అర్హులు కారు (2)
తిరిగి లేచెదరు యేసు నామములో
కొలువు తీరెదరు పరలోకంలో (2)
కొలువు తీరెదరు పరలోకంలో     ॥ఈ మరణము॥

కురిసే ప్రతి కంటి నీరు ప్రభువు తుడుచును
మరణము మబ్బులను కరిగించును (2)
వేదనలు రోదనలు రద్దు చేయును
గతకాల సంగతులు గతించి పోవును (2)
గతకాల సంగతులు గతించి పోవును     ॥ఈ మరణము॥

English Lyrics

Audio

Download Lyrics as: PPT

పరలోకమే నా అంతఃపురం

పాట రచయిత: సిరివెళ్ల హనోక్
Lyricist: Sirivella Hanok

Telugu Lyrics


పరలోకమే నా అంతఃపురం
చేరాలనే నా తాపత్రయం (2)
యేసుదేవరా – కనికరించవా – దారి చూపవా (2) ||పరలోకమే||

స్వల్ప కాలమే ఈ లోక జీవితం
నా భవ్య జీవితం మహోజ్వలం (2)
మజిలీలు దాటే మనోబలం
నీ మహిమ చూసే మధుర క్షణం (2)
వీక్షించు కన్నులు – విశ్వాస జీవితం – నాకు ఈయవా (2) ||పరలోకమే||

పాపము నెదిరించే శక్తిని నాకివ్వు
పరులను ప్రేమించే మనసే నాకివ్వు (2)
ఉద్రేక పరచే దురాత్మను
ఎదురించి పోరాడే శుద్ధాత్మను (2)
మోకాళ్ళ జీవితం – కన్నీటి అనుభవం – నాకు నేర్పవా (2) ||పరలోకమే||

English Lyrics

Audio

HOME