మన మధ్యనే ఉన్నది

పాట రచయిత: పి ఐసాక్
Lyricist: P Isaac

Telugu Lyrics


మన మధ్యనే ఉన్నది పరలోక రాజ్యం
మన మధ్యనే ఉన్నది దేవుని రాజ్యం (2)
పాపము లేదు పరలోకంలో
వ్యాధులు బాధలు లేనే లేదు
పాపము లేదు పరలోకంలో
వ్యాధులు బాధలు అసలే లేవు
నీ రాజ్యం మాకొచ్చును గాక
నీ చిత్తం భువిపై జరుగును గాక
పరలోక రాజ్యాన్ని ఈ భువిపై మేము
ఇప్పుడే అనుభవిస్తాము – (2)
ఇక్కడే అనుభవిస్తాము

సిలువలో మన శాపం తొలగిపోయెను
ఆశీర్వాదముకు మనము వారసులం
దారిద్య్రముతో లేదు మాకు సంబంధం
ఆత్మలో ఫలియించి వర్థిల్లెదం
అన్నిటిలో సౌఖ్యముగా మేముందుము
కృప క్షేమములే మాకిక సొంతము
అన్నిటిలో సౌఖ్యముగా మేముందుము
కృప క్షేమములే మా సొంతము           ||నీ రాజ్యం||

ఆలు మగలు ఒకరికి ఒకరు త్యాగ మూర్తులై
కలసి జీవించుటయే పరలోక రాజ్యం
కలతలు లేవు మాకు కన్నీరు తెలియదు
సంతోషముతో మేము సాగిపోతాము
ఈ తరానికి మాదిరిగా మేముంటాము
పరలోక ప్రేమతో కలిసి జీవిస్తాం (2)         ||నీ రాజ్యం||

English Lyrics

Audio

పరలోకంలో ఉన్న మా యేసు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


పరలోకంలో ఉన్న మా యేసు
భూ లోకమంతటికి వెలుగు నీవయ్యా (2)

బూర గానంలో యేసు రావాలా
యేసులో నేను సాగిపోవాలా (2)           ||పరలోకంలో||

స్తుతి పాటలే నేను పాడాలా
క్రీస్తు ఒడిలో నే సాగి పోవాలా (2)           ||పరలోకంలో||

మధ్యాకాశంలో విందు జరగాలా
విందులో నేను పాలు పొందాలా (2)           ||పరలోకంలో||

సూర్య చంద్రుల నక్షత్రాలన్నీ
నీ దయ వలన కలిగినావయ్యా (2)           ||పరలోకంలో||

సృష్టిలో ఉన్న జీవులన్నిటిని
నీ మహిమ కలిగినావయ్యా (2)           ||పరలోకంలో||

దూత గానంతో యేసు రావాలా
యేసు గానంలో మనమంతా నడవాలా (2)           ||పరలోకంలో||

English Lyrics

Audio

ఎవరికి ఎవరు

పాట రచయిత: బాబన్న
Lyricist: Babanna

Telugu Lyrics

ఎవరికి ఎవరు ఈ లోకంలో
చివరికి యేసే పరలోకంలో (2) ||ఎవరికి||

ఎవరెవరో ఎదురౌతుంటారు
ప్రాణానికి నా ప్రాణం అంటారు (2)
కష్టాలలో వారు కదిలి పోతారు
కరుణగల యేసు నాతో ఉంటాడు (2) ||ఎవరికి||

ధనము నీకుంటే అందరు వస్తారు
దరిద్రుడవైతే దరికెవ్వరు రారు (2)
ఎవరిని నమ్మిన ఫలితము లేదురా
యేసుని నమ్మితే మోక్షం ఉందిరా (2) ||ఎవరికి||

మనుషుల సాయం వ్యర్ధమురా
రాజుల నమ్మిన వ్యర్ధమురా (2)
యెహోవాను ఆశ్రయించుట
ఎంత మేలు.. ఎంతో మేలు (2) ||ఎవరికి||

English Lyrics

Audio

HOME