సహోదరులు ఐక్యత కలిగి

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


అది తల మీద పోయబడి
అహరోను గడ్డము మీదుగా కారినా…

సహోదరులు ఐక్యత కలిగి నివసించుట
ఎంత మేలు – ఎంత మనోహరము
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట
ఎంత మేలు – ఎంత మనోహరము
అది తల మీద పోయబడి
అహరోను గడ్డము మీదుగా కారినా…
పరిమళము – పరిమళ తైలము – (2)     ||సహోదరులు||

సంఘ సహవాసములో సహోదరులు
మత్సరము ద్వేషము అసూయతో నిండి (2)
వాక్యమును విడచి ఐక్యత లోపించి
తొలగిపోయిరి… ప్రభు కృప నుండి
సహవాసము పరిహాసమాయెను – (2)     ||సహోదరులు||

సిలువ వేయబడిన యేసు రక్షణ మరచి
స్వస్థతలు దీవెనలు అద్భుతములు (2)
క్షయమైన వాటి కొరకు – అక్షయుడగు ప్రభును వదిలి
అపహసించిరి… సువార్త సేవను
పరిశుద్ధాత్ముడు పరిహాసమొందెను – (2)     ||సహోదరులు||

English Lyrics

Audio

అంజలి ఘటియింతు

పాట రచయిత: దియ్యా ప్రసాద రావు
Lyricist: Diyya Prasada Rao

Telugu Lyrics

అంజలి ఘటియింతు దేవా (2)
నీ మంజుల పాదాంబుజముల కడ
నిరంజన మానస పరిమళ పుష్పాంజలి       ||అంజలి||

పరమాత్మ నీ పాద సేవ
చిరజీవ సంద్రాన నావ (2)
సిలువ మహా యజ్ఞ సింధూర
రక్తా రుణమేయ సంభావనా (2)
దేవా దేవా యేసు దేవా (2)
అంజలి ఘటియింతు దేవా       ||అంజలి||

అవతార మహిమా ప్రభావ
సువిశాల కరుణా స్వభావ (2)
పరలోక సింహాసనాసీన
తేజో విరాజమాన జగదావనా (2)
దేవా దేవా యేసు దేవా (2)
అంజలి ఘటియింతు దేవా       ||అంజలి||

English Lyrics

Audio

HOME