లేచినాడయ్యా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


లేచినాడయ్యా
మరణపు ముళ్ళు విరిచి లేచినాడయ్యా (2)
పరమ తండ్రి తనయుడు పరిశుద్ధాత్ముడు
మహిమా స్వరూపుడై లేచినాడయ్యా
విజయుడై జయశీలుడై
సజీవుడై పరిశుద్ధాత్ముడై (2)
క్రీస్తు లేచెను హల్లెలూయా
సాతాను ఓడెను హల్లేలూయా
క్రీస్తు లేచెను హల్లెలూయా
మరణాన్ని గెలిచెను హల్లేలూయా        ||లేచినాడయ్యా||

శ్రమలనొందెను సిలువ మరణమొందెను
లేఖనములు చెప్పినట్లు తిరిగి లేచెను (2)
విజయుడై జయశీలుడై
సజీవుడై పరిశుద్ధాత్ముడై (2)           ||క్రీస్తు||

జీవ మార్గము మనకు అనుగ్రహించెను
మన పాపములన్ని తుడిచివేసెను (2)
ప్రేమయై మనకు జీవమై
వెలుగునై మంచి కాపరియై (2)           ||క్రీస్తు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME