ప్రభువా నీలో జీవించుట

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics

ప్రభువా నీలో జీవించుట
కృపా బాహుల్యమే
నా యెడ కృపా బాహుల్యమే        ||ప్రభువా||

సంగీతములాయె
పెను తుఫానులన్నియు (2)
సమసిపోవునే నీ నామ స్మరణలో (2)
సంతసమొందె నా మది యెంతో (2)       ||ప్రభువా||

పాప నియమమును
బహు దూరముగా చేసి (2)
పావన ఆత్మతో పరిపూర్ణమైన (2)
పాద పద్మము హత్తుకొనెదను (2)       ||ప్రభువా||

నీలో దాగినది
కృప సర్వోన్నతముగా (2)
నీలో నిలిచి కృపలనుభవించి (2)
నీతోనే యుగయుగములు నిల్చెద (2)       ||ప్రభువా||

నూతన వధువునై
శుద్ధ వస్త్రములు ధరించి (2)
నూతనమైన శుభాకాంక్షలతో (2)
నూతన షాలేమై సిద్దమౌదు నీకై (2)       ||ప్రభువా||

English Lyrics

Audio

సాగేటి ఈ జీవ యాత్రలో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సాగేటి ఈ జీవ యాత్రలో
రేగేను పెను తుఫానులెన్నో (2)
ఆదరించవా నీ జీవ వాక్కుతో
సేదదీర్చవా నీ చేతి స్పర్శతో (2)
యేసయ్యా.. ఓ మెసయ్యా
హల్లెలూయా నీకే స్తోత్రమయా (2)            ||సాగేటి||

సుడి గాలులెన్నో లోక సాగరాన
వడిగా నను లాగి పడద్రోసే సమయాన (2)
నడిపించగలిగిన నా చుక్కాని నీవే (2)
విడిపించగలిగిన నాకున్న దిక్కు నీవే (2)          ||యేసయ్యా||

వడ గాటులెన్నో నా పయనములోన
నడవలేక సొమ్మసిల్ల చేసే సమయాన (2)
తడబాటును సరి చేసే ప్రేమ మూర్తి నీవే (2)
కడవరకు నడిపే ఇమ్మానుయేలు నీవే (2)          ||యేసయ్యా||

అలల శ్రమలెన్నో బ్రతుకు నావపైన
చెలరేగి విలవిలలాడించే సమయాన (2)
నిలబెట్టి బలపరిచే బలవంతుడ నీవే (2)
కలవరమును తొలగించే కన్న తండ్రి నీవే (2)          ||యేసయ్యా||

 

English Lyrics

Audio

ప్రార్ధన విన్నావయ్యా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ప్రార్ధన విన్నావయ్యా – విజయం నిచ్చావయ్యా (2)
తొట్రిల్ల నియ్యలేదు – తోడుండి నడిపించావు (2)
పొగడెద పాటపాడి – పెనుతుఫానాగిపోయె
పరవశించి పాడెదా (2)
తండ్రి దేవా మంచివాడా – నిరంతరం గొప్పవాడా (2)
నిరంతరం గొప్పవాడా (2)

కన్నీరు చూసావయ్యా – కరం పట్టి నడిపావయ్యా (2)
విన్నపం విన్నావయ్యా – విడుదల నిచ్చావయ్యా (2)      ||పొగడెద||

ఎబినేజర్ నీవేనయ్యా – సహాయం చేసావయ్యా (2)
ఎల్రోయి నీవేనయ్యా – నన్నిల చూసావయ్యా (2)      ||పొగడెద||

నిన్నే నమ్ముకొనెదన్ – నీపై ఆనుకొనెదన్ (2)
శాంతి నొసగువాడా – నీ సన్నిధి చాలునయ్యా (2)      ||పొగడెద||

English Lyrics

Audio

HOME