శత కోటి రాగాలు వల్లించిన

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


శత కోటి రాగాలు వల్లించిన
నా యేసుకే నేను స్తుతి పాడనా
దినమెల్ల ప్రభు సాక్ష్యమే చాటగా
ఈ నూతన వత్సరాన అడుగు పెట్టిన – ఆనందించనా
హ్యాపీ న్యూ ఇయర్ (2)
మై విషెస్ టు ఆల్ హియర్ (2)

నా కంటి పాపై నా ఇంటి వెలుగై
నన్నాదరించాడు నా యేసుడే
నా మంచి కోరి నా మేలు కోరి
నను పెంచుతున్నాడు నా యేసుడే
నా వల్ల ప్రభుకేమి ఒరిగేది లేదు (2)
అయినా నను ప్రేమిస్తాడు
కన్న తల్లిలా నను లాలిస్తాడు      ||హ్యాపీ||

నా ఆశ తానై – నా శ్వాస తానై
నన్ను నడుపుతున్నాడు నా యేసుడే
నాలోన యుక్తయి – నాలోన బలమై
నను దరికి చేర్చాడు నా యేసుడే
ఏమైనా నేనేమి ప్రభుకివ్వగలను (2)
వరదలా దీవిస్తాడు
కన్న తండ్రిలా నను మెప్పిస్తాడు ||హ్యాపీ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నిజముగా మొర పెట్టిన

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

నిజముగా మొర పెట్టిన
దేవుడాలకించకుండునా
సహనముతో కనిపెట్టిన
సమాధానమీయకుండునా
జీవముగల దేవుడు మౌనముగా ఉండునా
తన పిల్లలకాయన మేలు చేయకుండునా (2) ||నిజముగా||

పరలోక తండ్రినడిగిన
మంచి ఈవులీయకుండునా (2)
కరములెత్తి ప్రార్థించినా
దీవెనలు కురియకుండునా (2)       ||జీవముగల||

సృష్టి కర్త అయిన ప్రభువుకు
మన అక్కర తెలియకుండునా (2)
సరి అయిన సమయానికి
దయచేయక ఊరకుండునా (2)         ||జీవముగల||

సర్వశక్తుడైన ప్రభువుకు
సాధ్యము కానిదుండునా (2)
తన మహిమ కనపరచుటకు
దయ చేయక ఊరకుండునా (2)       ||జీవముగల||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME