అంబరాన్ని దాటే

పాట రచయిత: సాయారాం గట్టు
Lyricist: Sayaram Gattu

Telugu Lyrics

అంబరాన్ని దాటే సంబరాలు నేడు
నింగిలో చుక్క బుట్టి వచ్చింది మనకు తోడు (2)
రండయ్యో రండి రండి దావీదు పురముకు (2)
రారాజు పుట్టి ఇల పిలిచెను కొలువుకు (2)    ||అంబరాన్ని||

దేవుడు ఎంతగానో ప్రేమించి లోకము
ఏకైక తనయుని పంపెను ఈ దినము (2)
పశువుల పాకలో ఒదిగేను శిశువుగా (2)
అవతరించే నేడు లోక రక్షకునిగా (2)         ||రండయ్యో||

దేవాది దేవుడు మనిషిగా మారిన వేళ
శాపాలు పాపాలు రద్దయిన శుభవేళ (2)
లోకాల కారకుడు లోకమున పుట్టెను (2)
మనిషి మరణము ఆయువు తీరెను (2)         ||రండయ్యో||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నీ జీవితం విలువైనది

పాట రచయిత: దేవరాజు జక్కి
Lyricist: Devaraju Jakki

Telugu Lyrics

నీ జీవితం విలువైనది
ఏనాడు ఏమరకు
శ్రీ యేసు నామం నీకెంతో క్షేమం
ఈనాడే యోచించుమా
ఓ నేస్తమా తెలియునా
ప్రభు యేసు నిన్ను పిలిచెను
నా నేస్తమా తెలిసికో
ప్రభు యేసు నీకై మరణించెను            ||నీ జీవితం||

బలమైన పెను గాలి వీచి
అలలెంతో పైపైకి లేచి (2)
విలువైన నీ జీవిత నావా
తలకిందులై వాలిపోవ
వలదు భయము నీకేలా
కలదు యేసే నీ తోడు
యేసు మరణించి మరి లేచెను
నిన్ను ప్రేమించి దరి చేర్చును       ||నీ జీవితం||

గాఢాంధకారంపు లోయలో
వల గాలి వడి సవ్వడిలో (2)
నడయాడి నీ జీవిత త్రోవా
సుడివడి నీ అడుగు తడబడిన
వలదు భయము నీకేలా
కలదు యేసే నీ తోడు
యేసు మరణించి మరి లేచెను
నిన్ను ప్రేమించి దరి చేర్చును       ||నీ జీవితం||

కనలేని గమ్యంబు కోరి
ఎనలేని కష్టాల పాలై (2)
మనలేని నీ జీవిత గాథా
కలలన్ని కన్నీటి వ్యథలే
వలదు భయము నీకేలా
కలదు యేసే నీ తోడు
యేసు మరణించి మరి లేచెను
నిన్ను ప్రేమించి దరి చేర్చును       ||నీ జీవితం||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME