మంచి స్నేహితుడు

పాట రచయిత: సురేష్ వంగూరి
Lyricist: Suresh Vanguri

Telugu Lyrics

మంచి స్నేహితుడు (2)
హితమును కోరే బ్రతుకును మార్చే
ప్రాణస్నేహితుడేసు (2)        ||మంచి స్నేహితుడు||

ఒరిగిన వేళ పరుగున చేరి
గుండెలకదిమే తల్లవుతాడు
అక్కరలోన పక్కన నిలిచి
చల్లగ నిమిరే తండ్రవుతాడు
ఒంటరితనమున చెలిమవుతాడు
కృంగిన క్షణమున బలమవుతాడు – (2)        ||మంచి స్నేహితుడు||

చీకటి దారుల తడబడు ఘడియల
వెచ్చగ సోకే వెలుగవుతాడు
పతనపు లోయల జారిన వేళల
చెయ్యందించే గెలుపవుతాడు
శోధనలోన ఓర్పవుతాడు
శోకంలో ఓదార్పవుతాడు – (2)        ||మంచి స్నేహితుడు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

రవికోటి తేజుడు

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics


నా దేవుడే నాకు ప్రాణ స్నేహితుడు
నా దేవుడే నాకు మార్గ దర్శకుడు
నా దేవుడే నాకు నిత్య పోషకుడు
నా దేవుడే నాకు జీవన దాయకుడు
గతి లేని నన్ను వెదకిన – అతి కాంక్షనీయుడాయనే
మితి లేని ప్రేమ చూపిన – రవికోటి తేజుడాయనే         ||నా దేవుడే||

శ్రమలలో నా తోడుగా నన్ను నడిపించెను
నా నీడగా వెన్నంటియున్న నా ప్రాణనాథుడు
మరణపు సంకెళ్ళ నుండి నన్ను విడిపించెను
నా బంధకాలన్ని తెంచి వేసిన నా నీతిసూర్యుడు
క్షణమైన మరువని వీడని నా క్షేమా శిఖరము
క్షమియించి నాకు అందించెను ఈ రక్షణానందము
క్షయమైన బ్రతుకు మార్చి అక్షయతనొసగెను        ||గతి లేని||

వాక్యమే నా జీవమై నన్ను బ్రతికించెను
నా పాదములకు చిరు దీపమైన నా దివ్య తేజము
ఆత్మయే పరిపూర్ణమై నన్ను బలపరచెను
నా అడుగు జాడలను స్థిరము చేసిన నా జీవ మార్గము
నా గమ్యమేమిటో తెలియక నా పరుగు ఆగిపోగా
నా చేయి పట్టి నను నడిపిన నా మార్గదర్శి యేసే
విలువైన ప్రేమ నాపై నిలువెల్ల కురిసెను        ||గతి లేని||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

HOME