అదిగదిగో అల్లదిగో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

అదిగదిగో అల్లదిగో
కల్వరి మెట్టకు దారదిగో
ఆ ప్రభువును వేసిన సిలువదిగో     ||అదిగదిగో||

గెత్సేమను ఒక తోటదిగో
ఆ తోటలో ప్రార్ధన స్థలమదిగో (2)
అచటనే యుండి ప్రార్ధించుడని (2)
పలికిన క్రీస్తు మాటదిగో (2)       ||అదిగదిగో||

శిష్యులలో ఇస్కరియోతు
యూదాయను ఒక ఘాతకుడు (2)
ప్రభువును యూదులకప్పగింప (2)
పెట్టిన దొంగ ముద్దదిగో (2)       ||అదిగదిగో||

లేఖనము నెరవేరుటకై
ఈ లోకపు పాపము పోవుటకై (2)
పావనుడేసుని రక్తమును గల (2)
ముప్పది రూకల మూటదిగో (2)       ||అదిగదిగో||

చలి కాచుకొను గుంపదిగో
ఆ పేతురు బొంకిన స్థలమదిగో (2)
మూడవసారి బొంకిన వెంటనే (2)
కొక్కొరొకోయను కూతదిగో (2)       ||అదిగదిగో||

యూదుల రాజువు నీవేనా
మోదముతో నీవన్నట్లే (2)
నీలో దోషము కనుగొనలేక (2)
చేతులు కడిగిన పిలాతుడాడుగో (2)       ||అదిగదిగో||

గొల్గొతా స్థల అద్దరిని
ఆ ఇద్దరు దొంగల మధ్యమున (2)
సాక్షాత్తు యెహోవా తనయుని (2)
సిలువను వేసిరి చూడదిగో (2)       ||అదిగదిగో||

గొల్లున ఏడ్చిన తల్లదిగో
ఆ తల్లికి చెప్పిన మాటదిగో (2)
యూదుల రాజా దిగి రమ్మనుచు (2)
హేళన చేసిన మూకదిగో (2)       ||అదిగదిగో||

దాహము గొనుచున్నాననుచు
ప్రాణము విడిచెను పావనుడు (2)
పరిశుద్ధుడు మన రక్షకుడేసు (2)
మన మది యేమో గమనించు (2)       ||అదిగదిగో||

English Lyrics

Audio

నీవే నీవే కావాలి

పాట రచయిత: పాల్ ఇమ్మానుయేల్ & నిస్సీ పాల్
Lyricist: Paul Emmanuel & Nissy Paul

Telugu Lyrics

నీవే నీవే కావాలి ప్రభువుకు
నేడే నేడే చేరాలి ప్రభువును (2)
ఈ కాలం కృప కాలం తరిగిపోతుంది
నీ మరణం లోకాంతం తరుముకొస్తుంది (2)       ||నీవే||

నీ సృష్టికర్తను నీవు విడచినా
నీకిష్టమైన రీతి నీవు నడచినా (2)
దోషివయినా ద్రోహివయినా
దేవుని చెంత – చేరిపుడైనా (2)      ||ఈ కాలం||

పాపాలతో నీవు పండిపోయినా
ప్రేమించువారు లేక కృంగిపోయినా (2)
యేసుని చరణం – పాప హరణం
యేసుని స్నేహం – పాపికి మోక్షం (2)      ||ఈ కాలం||

నీటి బుడగలాంటిది నీ జీవితం
గడ్డి పువ్వులాంటిది నీ యవ్వనం (2)
అధికుడవైనా అధముడవైనా
ఆయన ప్రేమ – కోరిపుడైనా (2)      ||ఈ కాలం||

English Lyrics

Audio

తెల్లారింది వేళ

పాట రచయిత: శామ్యూల్ కర్మోజి
Lyricist: Samuel Karmoji

Telugu Lyrics


అన్నయ్య… తెల్లారింది లేరా..
తెల్లారింది వేళ – త్వరగా నిద్దుర లేరా
మనమంతా ఆయన సృష్టే రా
పక్షుల కోలాహ వేళ – ప్రభువును స్తుతించావేరా
వాటి కంటె శ్రేష్ఠుల మనమేరా (2)

అడవి రాజు సింహమైననూ – ఆకలంటు పిల్లలన్ననూ
యేసు రాజు పిల్లలం మనం – పస్తులుంచునా (2)
వాడిపోవు అడవి పూలకు – రంగులేసి అందమిచ్చెను
రక్తమిచ్చి కొన్న మనలను – మరచిపోవునా (2)
మరచిపోవునా               ||తెల్లారింది||

చిన్నదైన పిచ్చుకైననూ – చింత ఉందా మచ్ఛుకైననూ
విత్తలేదు కోయలేదని – కృంగిపోవునా (2)
వాటికన్ని కూర్చువాడు – నీ తండ్రి యేసేనని
నీకు ఏమి తక్కువ కాదని – నీకు తెలియునా (2)
నీకు తెలియునా               ||తెల్లారింది||

English Lyrics

Audio

యెహోవాను స్తుతియించు

పాట రచయిత: జోఫి నయనపోగుల
Lyricist: Joffy Nayanapogula

Telugu Lyrics


యెహోవాను స్తుతియించు – ప్రభువును ఘనపరచు
మహా దేవుని సేవించు – యేసుని పూజించు (2)
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
బలవంతుడైన నిత్యుడగు తండ్రి (2)
సమాధానకర్త అయిన రారాజును
ఆత్మతోను సత్యముతోను – బలముతోను మనసుతోను
కరములు తట్టి కేకలు వేసి – గంతులు వేసి నాట్యము చేసి
కలిగున్నదంతటితోను యెహోవాను స్తుతియించు         ||యెహోవాను||

ఆకాశ మహిమలు ఆయనను స్తుతియించు
భూలోక సంపూర్ణత ఆయనను స్తుతియించు
తన చేతి క్రియలన్ని ఆయనను స్తుతియించు
పిల్లనగ్రోవితో ఆయనను స్తుతియించు
నీ చేతులెత్తి పరిశుద్ధ సన్నిధిలో                ||ఆత్మతోను||

స్వరమండలముతో ఆయనను స్తుతియించు
సితార స్వరములతో ఆయనను స్తుతియించు
గంభీర ధ్వనితో మ్రోగెడి తాళముతో
తంబుర నాట్యముతో తంతి వాద్యముతో
జీవమున్న ప్రతి ప్రాణి ఆయనను స్తుతియించు         ||ఆత్మతోను||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

HOME