ఆకాశమే పట్టనోడు

పాట రచయిత: కే ఆర్ జాన్
Lyricist: KR John

Telugu Lyrics

అవనిలో ఉద్భవించె ఆది సంభూతిని చూడరే
పుడమియే పరవశించె పసిబాలుని చూడగనే… పసిబాలుని చూడగనే

ఆకాశమే పట్టనోడు – ధరణిలో పుట్టినాడు
దావీదు పురమునందు దీనుడై – వెలసినాడు రక్షకుడు (2)
ఆనందమే మహా ఆనందమే – అందరికి ఇలలో సంతోషమే
ఆశ్చర్యమే ఇది అద్భుతమే – యేసు జననం అద్భుతమే (2)

అదృశ్య దేవుని మహిమ స్వరూపుడు
ఆది అంతమైన పరలోక నాథుడు(2)
ఆదియందు వాక్యంబుగా – సృష్టి కార్యము జరిగించినాడు
అనాది నుండి జ్ఞానంబుగా – సృష్టి క్రమము నడిపించినాడు (2)
అన్నిటిని కలిగించిన మహరాజు
కన్నీటిని తుడచుటకు దిగివచ్చినాడు (2)     ||ఆనందమే||

ప్రేమను పంచే ప్రేమామయుడు
రక్షణ ఇచ్చే రక్షించే దేవుడు (2)

పాపమే లేని సుగుణాల సుందరుడు
శాపము బాపను జన్మించెను చూడు (2)
నిత్యముండు నీతి సూర్యుడు – సత్యసాక్షిగా ఇలకొచ్చినాడు
ప్రేమను పంచే పావనాత్ముడు – పశుల పాకలో పవళించినాడు (2)
సర్వాధికారియైన మహరాజు
దీనులకు దీవెనగా దిగి వచ్చినాడు (2) ||ఆనందమే||    ||ఆకాశమే||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

చుక్క పుట్టింది

పాట రచయిత: మోజెస్ డేవిడ్ కళ్యాణపు
Lyricist: Moses David Kalayanapu

Telugu Lyrics

వాక్యమే శరీర ధారియై – లోక రక్షకుడు ఉదయించె
పాపాన్ని శాపాన్ని తొలగింపను – రక్షకుడు భువికేతెంచెను
ఊరు వాడా వీధులలో – లోకమంతా సందడంటా
ఆడెదము కొనియాడెదము – అరే పూజించి ఘనపరచెదం

చుక్క పుట్టింది ఏలో ఏలేలో – సందడి చేద్దామా ఏలో
రాజు పుట్టినాడు ఏలో ఏలేలో – కొలవబోదామా ఏలో

గొర్రెల విడచి మందల మరచి
గాబ్రియేలు వార్త విని వచ్చామమ్మా
గానములతో గంతులు వేస్తూ
గగనాన్నంటేలా ఘనపరచెదం (2)
చీకట్లో కూర్చున్న వారి కోసం – నీతి సూర్యుడేసు ఉదయించే
పాపాన్ని శాపాన్ని తొలగింపను – పరమును చేర్చను అరుదించే

ఈ బాలుడే మా రాజు – రాజులకు రారాజు
ఇహం పరం అందరము
జగమంతా సందడి చేద్దాం

చుక్క పుట్టింది ఏలో ఏలేలో – సందడి చేద్దామా ఏలో
పొలమును విడచి ఏలో ఏలేలో – పూజ చేద్దామా ఏలో

తారను చూచి తరలి వచ్చాము
తూర్పు దేశపు జ్ఞానులము
తన భుజముల మీద రాజ్య భారమున్న
తనయుడెవరో చూడ వచ్చామమ్మా (2)
బంగారు సాంబ్రాణి బోళములు – బాలునికి మేము అర్పించాము
మా గుండెల్లో నీకేనయ్యా ఆలయం – మా మదిలో నీకేనయ్యా సింహాసనం

ఈ బాలుడే మా రాజు – రాజులకు రారాజు
ఇహం పరం అందరము
జగమంతా సందడి చేద్దాం

చుక్క పుట్టింది ఏలో ఏలేలో – సందడి చేద్దామా ఏలో
జ్ఞాన దీప్తుడమ్మా ఏలో ఏలేలో – భువికేతెంచెనమ్మా ఏలో

నీవేలే మా రాజు – రాజులకు రాజు
నిన్నే మేము కొలిచెదము – హోసన్న పాటలతో
మా హృదయములర్పించి – హృదిలో నిను కొలిచి
క్రిస్మస్ నిజ ఆనందం – అందరము పొందెదము

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME