ఏ తెగులు నీ గుడారము

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా
అపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా (2)
లలల్లాలాలల్లా లలల్లాలాలల్లా
లలల్లాలాలల్లా లలల్లా (2)

ఉన్నతమైన దేవుని నీవు
నివాసముగా గొని
ఆశ్చర్యమైన దేవుని నీవు
ఆదాయ పరచితివి (2)       ||ఏ తెగులు||

గొర్రెపిల్ల రక్తముతో
సాతానున్ జయించితిని
ఆత్మతోను వాక్యముతో
అనుదినము జయించెదను (2)       ||ఏ తెగులు||

మన యొక్క నివాసము
పరలోక-మందున్నది
రానైయున్న రక్షకుని
ఎదుర్కొన సిద్ధపడుమా (2)       ||ఏ తెగులు||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

ఎక్కడో మనసు వెళ్ళిపోయింది

పాట రచయిత: ప్రసన్న బెన్హర్
Lyricist: Prasanna Benhur

Telugu Lyrics

ఎక్కడో మనసు వెళ్ళిపోయింది
ఏమిటో ఇటు రానే రానంది
ఆహాహా.. ఓహోహో…
నిజ ప్రేమ చెంతకు తను చేరానంటుంది
ఈ భువిలోన ఎక్కడైనను కానరాదంది (2)
అక్కడే చిక్కుకుపోయానంటుంది
బయటకు రానే రాలేనంటూ మారాము చేస్తుంది (2)         ||ఎక్కడో||

జీవితాంతము పాద చెంతనే ఉంటానంటుంది
తన ప్రియుని వదలి క్షణమైనా రాలేనన్నది (2)
దేనికీ ఇక చోటే లేదంది
యేసు రాజుని గుండె నిండ నింపుకున్నానంటుంది (2)         ||ఎక్కడో||

ఏకాంతముగా యేసయ్యతో ఉన్నానంటుంది
ఎవరైనా సరే మధ్యలో అసలెందుకు అంటుంది (2)
అక్కడే కరిగిపోతానంటుంది
ప్రేమ ప్రవాహములో మునిగి పోయానంటుంది (2)         ||ఎక్కడో||

English Lyrics

Audio

HOME