వందనాలు యేసు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


వందనాలు యేసు నా వందనాలో
వందనాలు శతకోటి వందనాలు (2)

అబ్రాహాము దేవా నా వందనాలు
ఇస్సాకు దేవా నా వందనాలు (2)
అబ్రాహాము దేవా – ఇస్సాకు దేవా
యాకోబు దేవా నా వందనాలు (2)

నన్ను పిలిచావు వందనాలో
నన్ను కలిసావు వందనాలు (2)
నన్ను మరువలేదు వందనాలో
నన్ను విడువలేదు వందనాలు (2)     ||నన్ను పిలిచావు||

మహిమనే విడిచావు వందనాలు
మహిలోనికి వచ్చావు వందనాలు (2)
మహిమనే విడిచావు – మహిలోనికి వచ్చావు
మార్గమై నిలిచావు వందనాలు (2)     ||నన్ను పిలిచావు||

మరణమే గెలిచావు వందనాలు
మహిమనే చూపావు వందనాలు (2)
మరణమే గెలిచావు – మహిమనే చూపావు
మాటనే నిలిచావు వందనాలు (2)     ||నన్ను పిలిచావు||

సిలువనే మోసావు వందనాలు
నా బరువునే దించావు వందనాలు (2)
సిలువనే మోసి – నా బరువునే దించి
నా ఋణమునే తీర్చావు వందనాలు (2)     ||నన్ను పిలిచావు||

నా తోడు నీవే నా వందనాలు
నా నీడ నీవే నా వందనాలు (2)
నా తోడు నీవే – నా నీడ నీవే
నా వాడవు నీవే నా వందనాలు (2)     ||నన్ను పిలిచావు||

English Lyrics

Audio

యేసు రాజ నాలో నిన్ను

పాట రచయిత: రాజబాబు
Lyricist: Rajababu

Telugu Lyrics


యేసు రాజ నాలో నిన్ను చూడనీ
త్వరలో నీలో నన్ను సాగనీ (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
యేసయ్యా నా యేసయ్యా – (2)          ||యేసు రాజ||

తరిమే తరతరాల ఒరవడిలో
ఉరికే పరిసరాల సవ్వడిలో (2)
నీ తోడే చాలని – నీ నీడే మేలని
నా కోట నీవని – నీ సాటి లేరని         ||యేసయ్యా||

పెరిగే అన్యాయపు చీకటిలో
కరిగే అనురాగపు వాకిటలో (2)
నీ మాట చాలని – నీ బాట మేలని
నా పాట నీవని – నీ సాటి లేరని         ||యేసయ్యా||

English Lyrics

Audio

యేసయ్యా నా దొరా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసయ్యా నా దొరా
నీ సాటి ఎవరయ్యా ఈ ధర
నా కోసమే వచ్చిన సర్వేశ్వరా
నను విడిపించిన కరుణాకరా
మనసార నిన్నే కొలుతు ప్రాణేశ్వరా
వేసారిపోనయ్యా ధవళాంబరా (2)        ||యేసయ్యా||

మండే నా బ్రతుకే పాటగా
నిండైన నీ బ్రతుకే బాటగా (2)
పండంటి నీ ప్రేమ తోటలో
మెండైన నీ వాక్యపు ఊటలో
దొరికింది నా వరాల మూట
సప్త స్వరాలే చాలవింక నా నోట (2)        ||యేసయ్యా||

నలిగిన నా బ్రతుకే అర్పణమయ్యా
వెలుగైన నీ వాక్యమే దర్పణమయ్యా (2)
మిగిలిన శ్రమలను సంతర్పణలో
కదిలే కన్నీటి అర్చనలో
పండింది నా నోముల పంట
ఎంత పంచినా తరగదు ఈ దేటంట (2)        ||యేసయ్యా||

నా దాగు చోటు నీవేనయ్యా
చికాకు పడక నన్ను కాచేవయ్యా (2)
ఏకాకి నేనింక కాబోనయ్యా
నీ రాక కోసమే ఉన్నానయ్యా
శ్రీమంతుడా సాత్వికుడా
పరిపూర్ణుడా కడు దీనుడా (2)        ||యేసయ్యా||

English Lyrics

Audio

 

 

HOME