నీ చిత్తమునే

పాట రచయిత: శ్రీనివాస్ బండారు
Lyricist:
Srinivas Bandaru

Telugu Lyrics

నీ చిత్తమునే నెరవేర్చుటకై నను ఎన్నుకొని
నీ కృపావరమునే దానముగా దయచేసి (2)
నీ ప్రేమలో పరవశించి
నీ సన్నిధిలో నే చేరి
నీ నామమును నీ ప్రేమను నేను ఘనపరచెదను
దేవా… నా దేవా…
నా యేసయ్యా నా రక్షకుడా (2)      ||నీ చిత్తమునే||

హృదయము బద్దలై ఏడ్చిన వేళ
కన్నీటి ప్రార్దన చేసిన వేళ (2)
నీ చిత్తముకై నే ఎదురు చూసి
నీ బలము పొంద సహియింప చేసి
నా ప్రాణమును తృప్తి పరచితివే       ||దేవా||

నాలోని ప్రాణం తల్లడిల్లిపోగా
భూదిగంతములనుండి మొర్ర పెట్టుచున్నాను (2)
నా శత్రువుపైనే జయమునిచ్చి
నా ఆశ్రయమై ధైర్యమును నింపి
నా కోట నీవైతివే       ||దేవా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

శుద్దుడా ఘనుడా రక్షకుడా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


శుద్దుడా ఘనుడా రక్షకుడా
నా కాపరి నీవే నా దేవుడా
శక్తి లేని నాకు బలమిచు వాడా
నా స్నేహితుడా బలవంతుడా

హర్షింతును నిన్ను ఆరాధింతును
స్తుతియింతును నే కీర్తింతును
శక్తి లేని నాకు బలమిచ్చు వాడా
నా స్నేహితుడా బలవంతుడా

రక్షణా ఆధారం నీవే
విమోచనా నీవే యేసయ్యా
నా స్నేహితుడా బలవంతుడా

English Lyrics

Audio

Download Lyrics as: PPT

సుందరుడా అతి కాంక్షనీయుడా

పాట రచయిత: కృపాల్ మోహన్
Lyricist: Kripal Mohan

Telugu Lyrics


సుందరుడా అతి కాంక్షనీయుడా
నా ప్రియా రక్షకుడా
పరిశుద్ధుడా నా ప్రాణ నాథుడా
నాదు విమోచకుడా
నీ స్వరము మధురం
నీ ముఖము మనోహరము (2)        ||సుందరుడా||

కనబడనిమ్ము వినబడనిమ్ము
నాదు స్నేహితుడా (2)
స్నేహితుడా నా స్నేహితుడా
నా ప్రియుడా నా ప్రాణ నాథుడా (2)

English Lyrics

Audio

రక్షకుడా యేసు ప్రభో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా
స్వచ్చమైన నిత్య ప్రేమ చూపిన దేవా (2)       ||రక్షకుడా||

సర్వ లోక రక్షణకై సిలువనెక్కెను (2)
శ్రమ అయిననూ బాధ అయిననూ (2)
ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా
క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా
రక్షకుడా…                      ||రక్షకుడా||

ఎంచలేని యేసు నాకై హింస పొందెనే (2)
హింస అయిననూ హీనత అయిననూ (2)
ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా
క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా
రక్షకుడా…                      ||రక్షకుడా||

ఎన్నడైన మారని మా యేసుడుండగా (2)
ఉన్నవైననూ రానున్నవైననూ (2)
ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా
హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ
రక్షకుడా…                      ||రక్షకుడా||

English Lyrics

Audio

 

 

HOME