ఒక చేతిలో కర్ర

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఒక చేతిలో కర్ర
ఒక చేతిలో గొర్రె (2)

చేసేటి చేతులలోన
మేకులు నాటిరి నరులు (2)

కారింది నీదు రక్తం కాలువలై పారే
చిందింది నీదు రక్తం సిలువపై వ్రాలే        ||ఒక చేతిలో||

నడిచేటి కాళ్ళలలోన
మేకులు నాటిరి నరులు (2)      ||కారింది||

కిరీటంబు తెచ్చిరి
తలపైన పెట్టిరి (2)      ||కారింది||

సిలువను తెచ్చిరి
భుజం పైన పెట్టిరి (2)      ||కారింది||

బల్లెంబు తెచ్చిరి
ప్రక్కలోన పొడచిరి (2)      ||కారింది||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

చిందింది రక్తం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

చిందింది రక్తం ఆ సిలువ పైన
కారింది రుధిరం కలువరిలోన (2)
కరుణ చూప లేదే కసాయి మనుష్యులు
కనికరించలేదే మానవ లోకం (2)     ||చిందింది||

ఏదేనులో పుట్టిన ఆ పాపము
శాపముగా మారి మరణ పాత్రుని చేసె (2)
ఆ మరణమును తొలగించుటకు
మరణ పాత్రను చేబూనావా (2)
నా మరణమును తప్పించినావా        ||కరుణ||

చేసింది లోకం ఘోరమైన పాపం
మోపింది నేరం నీ భుజము పైనా (2)
యెరుషలేములో పారిన నీ రక్తము
ఈ లోక విమోచన క్రయధనము (2)
ఈ లోక విమోచన క్రయధనము        ||కరుణ||

నువ్వు చేసిన త్యాగం మరువలేని యాగం
మరణపు ముల్లును విరిచిన దేవుడా (2)
జీవకిరీటము నిచ్చుటకై
ముళ్ళ కిరీటము ధరించితివా (2)
నాకు నిత్య జీవమిచ్చితివా       ||కరుణ||

English Lyrics

Audio

అమూల్య రక్తం

పాట రచయిత: దియ్యా ప్రసాద రావు
Lyricist: Diyya Prasada Rao

Telugu Lyrics

అమూల్య రక్తం – ప్రశస్త రక్తం
విలువైన రక్తం – శక్తి గల రక్తం (2)
యేసు రక్తమే జయము
క్రీస్తు రక్తమే విజయము (2)
పాప క్షమాపణ యేసు రక్తములోనే
శాప విమోచన క్రీస్తు రక్తములోనే          ||అమూల్య||

తండ్రి చిత్తము నెరవేర్చ
గెత్సేమనేలో ప్రార్ధింప (2)
చెమట రక్తము గొప్ప బిందువులై కారెనే
ఆత్మ శక్తిని ప్రసాదించును – అమూల్య రక్తమే (2)         ||యేసు||

శాపానికి ప్రతిఫలము ముళ్ళు
ముండ్ల కిరీటముతో చెల్లు (2)
ప్రభువు నొందెనే మనకై కొరడా దెబ్బలు
ప్రతి వ్యాధిని స్వస్థపరచును – అమూల్య రక్తమే (2)             ||యేసు||

నీ చేతుల పనిని ఆశీర్వదింప
ప్రభు చేతులలో మేకులు గొట్ట (2)
కాళ్లలో మేకులు సువార్తకు సుందరమే
బల్లెపు పోటు బాగు చేయును – గుండెలను (2)         ||యేసు||

English Lyrics

Audio

HOME