జయం జయం (మనకూ)

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


జయం జయం జయం జయం
జయం జయం జయం జయం (2)
మనకూ జయం మనకూ జయం
నాకూ జయం నీకూ జయం     ||జయం||

యేసు ప్రభువు రక్తమే పాపముపై జయం
క్రీస్తు యేసు నామమే సాతనుపై జయం (2)
సిలువ పైన మరణమే మరణముపై జయం
కల్వరిలో త్యాగమే నరకముపై జయం (2)       ||జయం||

ఆ కొరడా దెబ్బలే శ్రమలపై జయం
ఆ ముండ్లకిరీటమే బంధకముపై జయం (2)
గాయ పడిన హస్తమే కన్నీటిపై జయం
దప్పిగొన్న ప్రాణమే నిరాశలపై జయం (2)       ||జయం||

ఆ మధుర ప్రేమయే ద్వేషముపై జయం
ఆ దివ్య వాక్యమే లోకముపై జయం (2)
పరిశుద్ధాత్మ తోడుయే భయముపై జయం
ప్రార్ధనశక్తి వరములే బలహీనతపై జయం (2)       ||జయం||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

యేసు రక్తమే జయము

Telugu Lyrics


యేసు రక్తమే జయము జయమురా
సిలువ రక్తమే జయము జయమురా
ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా
తన పక్షము నిలబడిన గెలుపు నీదేరా (2)              ||యేసు||

బలహీనులకు బలమైన దుర్గము – ముక్తి యేసు రక్తము
వ్యాధి బాధలకు విడుదల కలిగించును – స్వస్థత యేసు రక్తము (2)
శాంతికి స్థావరం శ్రీ యేసుని రక్తం
నీతికి కవచం పరిశుద్ధుని రక్తం (2)
మృత్యువునే గెలుచు రక్తము
పాతాలం మూయు రక్తము
నరకాన్ని బంధించిన
జయశీలి అధిపతి రారాజు యేసయ్యే                 ||యేసు||

పాపికి శరణం యేసు రక్తము – రక్షణ ప్రాకారము
అపవిత్రాత్మను పారద్రోలును – ఖడ్గము యేసు రక్తము (2)
శత్రువు నిలువడు విరోధి ఎవ్వడు?
ఏ ఆయుధము నీపై వర్ధిల్లదు (2)
సాతాన్నే నలగ్గొట్టిన
వాడి తలనే చితగ్గొట్టిన
కొదమ సింహమై మేఘారూఢిగా
తీర్పు తీర్చవచ్చు రారాజు యేసయ్యే                ||యేసు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

అమూల్య రక్తం

పాట రచయిత: దియ్యా ప్రసాద రావు
Lyricist: Diyya Prasada Rao

Telugu Lyrics

అమూల్య రక్తం – ప్రశస్త రక్తం
విలువైన రక్తం – శక్తి గల రక్తం (2)
యేసు రక్తమే జయము
క్రీస్తు రక్తమే విజయము (2)
పాప క్షమాపణ యేసు రక్తములోనే
శాప విమోచన క్రీస్తు రక్తములోనే          ||అమూల్య||

తండ్రి చిత్తము నెరవేర్చ
గెత్సేమనేలో ప్రార్ధింప (2)
చెమట రక్తము గొప్ప బిందువులై కారెనే
ఆత్మ శక్తిని ప్రసాదించును – అమూల్య రక్తమే (2)         ||యేసు||

శాపానికి ప్రతిఫలము ముళ్ళు
ముండ్ల కిరీటముతో చెల్లు (2)
ప్రభువు నొందెనే మనకై కొరడా దెబ్బలు
ప్రతి వ్యాధిని స్వస్థపరచును – అమూల్య రక్తమే (2)             ||యేసు||

నీ చేతుల పనిని ఆశీర్వదింప
ప్రభు చేతులలో మేకులు గొట్ట (2)
కాళ్లలో మేకులు సువార్తకు సుందరమే
బల్లెపు పోటు బాగు చేయును – గుండెలను (2)         ||యేసు||

English Lyrics

Audio

మధురం మధురం నీ ప్రేమే

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


మధురం మధురం – నీ ప్రేమే అతి మధురం
అమరం అతి విజయం – నీ సిలువ రక్తమే విజయం
ఇమ్మానుయేలుడ నీ ప్రేమ మధురం – నీకే నా వందనం (2)
మధురం మధురం – నీ ప్రేమే అతి మధురం (2)        ||మధురం||

నా శిక్షకై నా నిందలకై – ప్రాణము పెట్టిన ప్రేమ
నిందలు నిట్టూర్పులు – సేదదీర్చిన ప్రేమ (2)
సర్వోన్నతుడా సహాయకుడా
మరువగలనా నీ ప్రేమను (2)        ||మధురం||

సత్యమును నాకు కేడెమును – ధరియింప చేసిన ప్రేమ
కనికరమును కలిగించగను – కల్వరికేగిన ప్రేమ (2)
మహోన్నతుడా మహా ఘనుడా
మరువగలనా నీ ప్రేమను (2)        ||మధురం||

English Lyrics

Audio

కల్వరి సిలువలో

పాట రచయిత: డేవిడ్ విజయరాజు గొట్టుముక్కల
Lyricist: David Vijayaraju Gottumukkala

Telugu Lyrics


కల్వరి సిలువలో – యేసయ్య నీ రక్తమే (2)
క్షమియించెను పాపము కడిగె – యేసయ్య నీ రక్తమే
పరిశుద్ధులుగా మము చేసెను – యేసయ్య నీ రక్తమే

కలుషములను కడిగేను – యేసయ్య నీ రక్తమే
కలవరము బాపెను – యేసయ్య నీ రక్తమే
సీయోనును మేము చేర్చెను – యేసయ్య నీ రక్తమే (2)
నీ రక్తమే – నీ రక్తమే
నీ రక్తమే – యేసు నీ రక్తమే

విడుదలను దయచేసెను – యేసయ్య నీ రక్తమే
విజయమును చేకూర్చెను – యేసయ్య నీ రక్తమే
శిక్షంతటిని తొలగించెను – యేసయ్య నీ రక్తమే (2)
నీ రక్తమే – నీ రక్తమే
నీ రక్తమే – యేసు నీ రక్తమే

వేదనను మాన్పెను – యేసయ్య నీ రక్తమే
ఓదార్పు మాకిచ్చెను – యేసయ్య నీ రక్తమే
శాశ్వత జీవం మాకిచ్చెను – యేసయ్య నీ రక్తమే (2)
నీ రక్తమే – నీ రక్తమే
నీ రక్తమే – యేసు నీ రక్తమే

అర్హతను మాకిచ్చెను – యేసయ్య నీ రక్తమే
ఆనందముతో నింపెను – యేసయ్య నీ రక్తమే
ఆశీర్వాదం మాకొసగెను – యేసయ్య నీ రక్తమే (2)
నీ రక్తమే – నీ రక్తమే
నీ రక్తమే – యేసు నీ రక్తమే (2)

English Lyrics

Audio

యేసు రక్తమే జయం

Telugu Lyrics


యేసు రక్తమే జయం… యేసు రక్తమే జయం
యేసు నామం ఉన్నత నామం (2)

పేరు పెట్టి పిలచినవాడు – విడువడు ఎన్నడు
ఆశ తీర్చు దేవుడు – ఆదరించును (2)
ఆశలన్ని అడి ఆశలుగా
మార్చునంత విపరీతముగా
చేయునదే నీ పాపము (2)

యెహోవా దయాళుడు… యెహోవా దయాళుడు
ఆయన కృప నిత్యముండును (2)

ఎవరు ఉన్నా లేకపోయినా – యేసు ఉంటే చాలు
లోకమంత విడనాడినా – నిన్ను విడువడు (2)
శ్రమయు బాధ హింస అయిననూ
కరువు వస్త్ర హీనతైననూ
ఖడ్గ మరణమెదురే అయిననూ (2)

యేసు పునరుత్థానుడు… యేసు పునరుత్థానుడు
మరణపు బలము ఓడిపోయెను (2)

English Lyrics

Audio

 

 

నీ రక్తమే నీ రక్తమే

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

నీ రక్తమే నీ రక్తమే నన్ శుద్దీకరించున్
నీ రక్తమే నా బలము (2)

నీ రక్త ధారలే ఇల
పాపికాశ్రయంబిచ్చును (2)
పరిశుద్ధ తండ్రి పాపిని
కడిగి పవిత్ర పరచుము (2)             ||నీ రక్తమే||

నశించు వారికి నీ సిలువ
వెర్రితనముగ నున్నది (2)
రక్షింపబడుచున్న పాపికి
దేవుని శక్తియై యున్నది (2)          ||నీ రక్తమే||

నీ సిల్వలో కార్చినట్టి
విలువైన రక్తముచే (2)
పాప విముక్తి చేసితివి
పరిశుద్ధ దేవ తనయుడా (2)          ||నీ రక్తమే||

పంది వలె పొర్లిన నన్ను
కుక్క వలె తిరిగిన నన్ను (2)
ప్రేమతో చేర్చుకొంటివి
ప్రేమార్హ నీకే స్తోత్రము (2)               ||నీ రక్తమే||

నన్ను వెంబడించు సైతానున్
నన్ను బెదరించు సైతానున్ (2)
దునుమాడేది నీ రక్తమే
దహించేది నీ రక్తమే (2)                 ||నీ రక్తమే||

స్తుతి మహిమ ఘనతయు
యుగయుగంబులకును (2)
స్తుతి పాత్ర నీకే చెల్లును
స్తోత్రార్హుడా నీకే తగును (2)            ||నీ రక్తమే||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

HOME