చీకటిలో కాంతివి

పాట రచయిత: జాన్ ఎర్రి & స్వాతి జాన్
Lyricist: John Erry & Swathi John

Telugu Lyrics

చీకటిలో కాంతివి
వేదనలో శాంతివి (2)
స్థితి గతులన్నిటిని మార్చువాడా
జీవితాలన్నిటిని కట్టువాడా (2)
యేసూ.. నీ సన్నిధిలో సాధ్యం
యేసూ.. నీ సన్నిధే నీ సన్నిధే (2)

సమస్తము సాధ్యం
నీ యందే నా విశ్వాసం (2)
స్థితి గతులన్నిటిని మార్చువాడా
జీవితాలన్నిటిని కట్టువాడా (2)
యేసూ.. నీ సన్నిధిలో సాధ్యం
యేసూ.. నీ సన్నిధే నీ సన్నిధే (2)

అతిక్రమమంతా తుడచువాడా
ఎల్లప్పుడూ కరుణించువాడా
మంచితనము కనపరచువాడా
ఎల్లప్పుడూ దీవించువాడా (2)
యేసూ.. నీ రక్తములో సాధ్యం
యేసూ.. నీ రక్తమే నీ రక్తమే (2)
యేసూ.. నీ రక్తములో సాధ్యం
యేసూ..

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నీకసాధ్యమైనది ఏదియు లేదు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నీకసాధ్యమైనది ఏదియు లేదు
సమస్తము సాధ్యము నీకు (2)
ప్రభువా ప్రభువా
సమస్తము సాధ్యం (2)       ||నీకసాధ్యమైనది||

వ్యాధులనుండి స్వస్థపరచుట సాధ్యం – సాధ్యం
బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం – సాధ్యం (2)
నీకు సాటియైన దేవుడు లేనే లేడు యేసయ్యా
నీకు సాటియైన దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా – నా యేసయ్యా (2)       ||నీకసాధ్యమైనది||

పాపమునుండి విడిపించుట సాధ్యం – సాధ్యం
శాపమునుండి విముక్తినిచ్చుట సాధ్యం – సాధ్యం (2)
నీలా ప్రేమించే దేవుడు లేనే లేడు యేసయ్యా
నీలా ప్రేమించే దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా – నా యేసయ్యా (2)       ||నీకసాధ్యమైనది||

దుష్ట శక్తులను కాల్చివేయుట సాధ్యం – సాధ్యం
నీతి రాజ్యమును స్థాపించుట సాధ్యం – సాధ్యం (2)
నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు లేడు యేసయ్యా
నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా – నా యేసయ్యా (2)       ||నీకసాధ్యమైనది||

సర్వ సత్యములో నడిపించుట సాధ్యం – సాధ్యం
పరిశుద్ధాత్మను అనుగ్రహించుట సాధ్యం – సాధ్యం (2)
నీలా పరిశుద్ధ దేవుడు లేనే లేడు యేసయ్యా
నీలా పరిశుద్ధ దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా – నా యేసయ్యా (2)       ||నీకసాధ్యమైనది||

English Lyrics

Audio

సమర్ధవంతుడవైన

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సమర్ధవంతుడవైన నా యేసయ్యా
సమస్తము నీకు సాధ్యమేనయ్యా (2)
నా స్తుతి యాగము నీకే
నా ప్రాణార్పణ నీకే
నా సర్వస్వము నీకే
నా జీవన గానము నీకే       ||సమర్ధ||

పచ్చిక పట్టులలో నన్ను పదిలముగా
ఉంచువాడవు నీవే యేసయ్యా
ఆత్మ జలములను నవ్యముగా
ఇచ్చువాడవు నీవే యేసయ్యా (2)
నే వెళ్ళు మార్గమునందు నా పాదము జారకుండా (2)
దూతల చేతులలో
నన్ను నిలుపువాడవు నీవే యేసయ్యా (2) నీ       ||సమర్ధ||

శత్రువు చరలోనుండి నను భద్రముగా
నిల్పువాడవు నీవే యేసయ్యా
రక్షణ వస్త్రమును నిత్యము నాపై
కప్పువాడవు నీవే యేసయ్యా (2)
జీవించు దినములన్నియు నాలో పాపము ఉండకుండా (2)
రక్తపు బిందువుతో
నన్ను కడుగువాడవు నీవే యేసయ్యా (2) నీ        ||సమర్ధ||

English Lyrics

Audio

 

HOME