నా జీవితం ప్రభు నీకంకితం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నా జీవితం ప్రభు నీకంకితం
నీ సేవకై నే అర్పింతును (2)

నీ మహిమను నేను అనుభవించుటకు
నను కలుగజేసియున్నావు దేవా (2)
నీ నామమును మహిమ పరచు
బ్రతుకు నాకనుగ్రహించు (2)           ||నా జీవితం||

కీర్తింతును నా దేవుని నే
ఉన్నంత కాలం (2)
తేజోమయా నా దైవమా
నీ కీర్తిని వర్ణించెద (2)           ||నా జీవితం||

English Lyrics

Audio

నీ ప్రియ ప్రభుని సేవకై

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

నీ ప్రియ ప్రభుని సేవకై – అర్పించుకో నీవే
పవిత్ర ప్రజలైన మీరు – సేవించుడాయననే (2)

అంధకార జీవితమునకు – వెలుగు తెచ్చెను తానే (2)
ఆ వెలుగు ద్వారానే – నూతన మార్గము కలిగె (2)
సజీవ బలిగా నర్పించు – నీ జీవితమాయనకే (2)       ||నీ ప్రియ||

తప్పిపోతివి గతమందు – తప్పు దారిని నడిచితివి (2)
తన ప్రేమా హస్తమే – నిన్ను కాపాడి తెచ్చెను (2)
యెంతైన స్మరియించు నీవు – వింతైన తన ప్రేమన్ (2)         ||నీ ప్రియ||

ఓ ప్రియుడా తలచితివా – నీ జన్మమే పాపమని (2)
ప్రభువే తన రక్తముతో – నీ పాపము క్షమియించె (2)
నీ యుల్లము ఆయన కాలయమే – జ్ఞాపకముంచుకొనుము (2)          ||నీ ప్రియ||

యెవరతని సేవించెదరో – ఫలమొందెదరంతమందు (2)
ఇతరులకు లేనట్టి – ఆ ఘనతను నీ కిచ్చె (2)
కృతజ్ఞుడవై కొనియాడు – ప్రభు పాద సన్నిధిని (2)          ||నీ ప్రియ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

HOME