తరచి తరచి

పాట రచయిత: జాన్ వెస్లీ
Lyricist: John Wesly

Telugu Lyrics

తరచి తరచి చూడ తరమా
వెదకి వెదకి కనుగొనగలమా
యేసు వంటి మిత్రుని లోకమందున
విడచి విడచి ఉండగలమా
మరచి మరచి ఇలా మనగలమా
యేసు వంటి స్నేహితుని విశ్వమందున

లోక బంధాలన్నీ తృప్తినివ్వలేవుగా
ఏ మనిషిని నమ్మాలో – తెలియదు ఈ లోకంలో
నేల మంటిలోన పరమార్ధం లేదుగా
ఎంత బ్రతుకు బ్రతికినా – చివరకు చితియేగా
నమ్మదగిన యేసు ప్రాణమిచ్చె నీకై
జగతిలోన దొరకునా ఇటువంటి ప్రాణప్రియుడు (2)         ||తరచి||

లేరు లేరు ఎవ్వరు కానరారు ఎవ్వరు
యేసు వంటి ప్రేమికుడు ఇహమందు పరమందు
పదివేలలోన అతి కాంక్షణీయుడు
కలతలన్ని తీర్చి కన్నీటిని తుడచును
కల్వరిగిరిలోన కార్చెను రుధిరం
హృదయమందు చేర్చుకో కృప చూపు నాథుని (2)         ||తరచి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

యేసుని తిరు హృదయమా

పాట రచయిత: పి ప్రకాష్ రెడ్డి
Lyricist: P Prakash Reddy

Telugu Lyrics


యేసుని తిరు హృదయమా
నన్ను రక్షించు నా దైవమా (2)
స్నేహితుని వోలె ఆదరించావు
బోధకుడై నన్ను మందలించావు (2)          ||యేసుని||

కష్టములొ నన్ను నీ రెక్కల దాచావు
దుఃఖంలో నా కన్నీరు తుడిచావు (2)
ఏ విధమున నిన్ను నే పొగడగలను (2)
నీ ఋణమును నేనెలా తీర్చగలను
నా తండ్రి నా దేవా          ||యేసుని||

నను కాచి కాపాడే నా మంచి కాపరివి
నాకింక భయమేల నీ అండదండలలో (2)
జీవించెద నీ బిడ్డగ ఏ చింత లేక (2)
నీ ఆత్మతో దీవించు నా యేసు
నా తండ్రి నా దేవా          ||యేసుని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నేనెరుగుదును ఒక స్నేహితుని

పాట రచయిత: షాలేం ఇజ్రాయెల్ అరసవెల్లి
Lyricist: Shalem Israyel Arasavelli

Telugu Lyrics


నేనెరుగుదును ఒక స్నేహితుని
అతడెంతో పరిశుద్ధుడు
ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ
కారణ భూతుడు (2)
అతడే యేసుడు… అతడే యేసుడు (2)        ||నేనెరుగుదును||

చీకటి దారులలో – చితికిన బ్రతుకులకు (2)
వెలుగు కలుగజేసే – జీవ జ్యోతి యేసే (2)        ||నేనెరుగుదును||

చెరిగిన మనసులతో – చెదరిన మనుజులకు (2)
శాంతి కలుగజేసే – శక్తిమంతుడేసే (2)        ||నేనెరుగుదును||

English Lyrics

Audio

HOME