వికసించు పుష్పమా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


వికసించు పుష్పమా (2)
యేసు పాదాల చెంతనే వికసించుమా
తండ్రి పాదాల చెంతనే ప్రార్ధించుమా   ||వికసించు||

నీ ప్రాణ ప్రియుడు సుందరుడు
నీ ప్రాణ ప్రియుడు అతి సుందరుడు (2)
మనోహరుడు అతి కాంక్షణీయుడు (2)
స్తోత్రార్హుడు (2)         ||వికసించు||

నీ పరమ తండ్రి మహిమాన్వితుడు (4)
మహోన్నతుడు సర్వ శక్తిమంతుడు (2)
పరిశుద్ధుడు (2)         ||వికసించు||

నీ హితుడు యేసు నిజ స్నేహితుడు (4)
విడువని వాడు నిను ఎడబాయని వాడు (2)
నీతి సూర్యుడు (2)         ||వికసించు||

English Lyrics

Audio

నింగిలో దేవుడు

పాట రచయిత: Jaladi
Lyricist: జాలాడి

Telugu Lyrics

నింగిలో దేవుడు నిను చూడ వచ్చాడు
ఆ నీతి సూర్యుడు శ్రీ యేసు నాధుడు (2)
చెంత చేరి సంతసించుమా (2)
స్వంతమైన క్రీస్తు సంఘమా        ||నింగిలో||

పాపాల పంకిలమై శోకాలకంకితమై
మరణించి మన కోసం కరుణించి ఆ దైవం (2)
దీన జన రక్షకుడై దేవ దేవుని సుతుడై (2)
జన్మించె నీ కోసం ధన్యము చేయగా (2)      ||నింగిలో||

సాతాను శోధనలే శాపాల వేదనలై
విలపించే దీనులకై అలరించు దీవెనలై (2)
శరణమై ఉదయించే తరుణమౌ ఈ వేళ (2)
గుండె గుడి పానుపులో చేర్చుకొన రావేల (2)      ||నింగిలో||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME