సృష్టి కర్తా యేసు దేవా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

సృష్టి కర్తా యేసు దేవా
సర్వ లోకం నీ మాట వినును (2)
సర్వ లోక నాథా సకలం నీవేగా
సర్వ లోక రాజా సర్వము నీవేగా
సన్నుతింతును అను నిత్యము         ||సృష్టి||

కానాన్ వివాహములో అద్భుతముగా
నీటిని ద్రాక్షా రసము చేసి
కనలేని అంధులకు చూపు నొసగి
చెవిటి మూగల బాగు పరచితివి
నీకసాధ్యమేదీ లేనే లేదు ఇలలో
ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు         ||సర్వ||

మృతుల సహితము జీవింపజేసి
మృతిని గెలిచి తిరిగి లేచితివి
నీ రాజ్యములో నీతో వసింప
కొనిపోవ త్వరలో రానుంటివే
నీకసాధ్యమేదీ లేనే లేదు ఇలలో
ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు       ||సర్వ||

English Lyrics

Audio

HOME