నిరతము స్తుతియించుము

పాట రచయిత: రాజా రెడ్డి యరబం
Lyricist: Raja Reddy Yarabam

Telugu Lyrics

నిరతము స్తుతియించుము ఓ మనసా
క్రీస్తేసుని స్తుతించు (2)
బాధలను తీర్చేటి ఆ స్తోత్రార్హుని
కష్టాలు తొలగించే ఆ కరుణశీలుని (2)
మరువక స్తుతియించుము ఓ మనసా
జయగీతముతో స్తుతించు      ||నిరతము||

వేదనలో విడిపించే ఆ దేవ దేవుని స్తుతియించుము
ఆపదలో ఆదుకొనే ఆరాధ్య దైవమునే స్తుతియించుము (2)
నిన్నిలలో ఓదార్చి తన కృపలో బలపరచే (2)
ఆ నిజ స్నేహితుని
కృతజ్ఞత కలిగి స్తుతియించుము – (2)      ||నిరతము||

అన్ని సమయాలలో చాలిన దేవుని స్తుతియించుము
పేరు జీవ గ్రంథములో వ్రాసిన గొర్రెపిల్లని స్తుతియించుము (2)
నీ భారం తొలగించి
తన కృపలో ఆదరించే (2)
నీ ఆత్మ కాపరియైన
పరిశుద్ధాత్ముని స్తుతియించుము – (2)      ||నిరతము||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

యేసు పరిశుద్ధ నామమునకు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసు పరిశుద్ధ నామమునకు
ఎప్పుడు అధిక స్తోత్రము (2)

ఇహపరమున మేలైన నామము
శక్తి గల్గినట్టి నామమిది (2)
పరిశుద్దులు స్తుతించు నామమిది (2)          ||యేసు||

సైతానున్‌ పాతాళమును జయించు
వీరత్వము గల నామమిది (2)
జయమొందెదము ఈ నామమున (2)          ||యేసు||

నశించు పాపుల రక్షించు లోక
మున కేతెంచిన నామమిది (2)
పరలోకమున చేర్చు నామమిది (2)          ||యేసు||

ఉత్తమ భక్తుల పొగడి స్తుతించు
ఉన్నత దేవుని నామమిది (2)
లోకమంతా ప్రకాశించే నామమిది (2)          ||యేసు||

శోధన, బాధల, కష్ట సమయాన
ఓదార్చి నడుపు నామమిది (2)
ఆటంకము తొలగించు నామమిది (2)          ||యేసు||

English Lyrics

Audio

 

 

 

దేవునియందు నిరీక్షణ నుంచి

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


దేవునియందు నిరీక్షణ నుంచి
ఆయనను స్తుతించు నా ప్రాణమా (2)

ఏ అపాయము రాకుండ నిన్ను – దివారాత్రులు కాపాడువాడు (2)
ప్రతిక్షణం – నీ పక్షముండు – రక్షకుడు (2)      ||దేవుని||

చీకటిని వెలుగుగా చేసి – ఆయన నీ ముందు పోవువాడు (2)
సత్యమగు – జీవమగు – మార్గమేసే (2)      ||దేవుని||

నీకు సహాయము చేయువాడు – సదా ఆదుకొను వాడు ఆయనే (2)
ఆధారము – ఆదరణ – ఆయనలో (2)      ||దేవుని||

తల్లి తన బిడ్డను మరచిననూ – మరువడు నీ దేవుడు నిన్ను (2)
తల్లికన్నా – తండ్రికన్నా – ఉత్తముడు (2)      ||దేవుని||

నీకు విరోధముగా రూపించిన – ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు (2)
శత్రువులు – మిత్రులుగా – మారుదురు (2)      ||దేవుని||

పర్వతములు తొలగి పోయిననూ – తన కృప నిన్ను ఎన్నడు వీడదు (2)
కనికర – సంపన్నుడు – నా దేవుడు (2)      ||దేవుని||

స్తుతి మహిమలు నీకే ప్రభు – నిత్యము నిన్నే కొనియాడెద (2)
హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ (2)      ||దేవుని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME