సుందరుడా

పాట రచయిత: ప్రతాప్ దర్శి
అనువదించినది: అనిందిత శామ్యూల్
Lyricist: Prathap Darshi
Translator: Anindita Samuel

Telugu Lyrics


సుందరుడా… అతిశయుడా…
మహోన్నతుడా… నా ప్రియుడా (2)

పదివేలలో నీవు అతిసుందరుడవు
నా ప్రాణప్రియుడవు నీవే
షారోను పుష్పమా… లోయలోని పద్మమా…
నిను నేను కనుగొంటినే (2)         ||సుందరుడా||

నిను చూడాలని
నీ ప్రేమలో ఉండాలని
నేనాశించుచున్నాను (4)        ||సుందరుడా||

యేసయ్యా నా యేసయ్యా
నీ వంటి వారెవ్వరు
యేసయ్యా నా యేసయ్యా
నీలాగ లేరెవ్వరు (2)        ||సుందరుడా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

సుందరుడా అతి కాంక్షనీయుడా

పాట రచయిత: కృపాల్ మోహన్
Lyricist: Kripal Mohan

Telugu Lyrics


సుందరుడా అతి కాంక్షనీయుడా
నా ప్రియా రక్షకుడా
పరిశుద్ధుడా నా ప్రాణ నాథుడా
నాదు విమోచకుడా
నీ స్వరము మధురం
నీ ముఖము మనోహరము (2)        ||సుందరుడా||

కనబడనిమ్ము వినబడనిమ్ము
నాదు స్నేహితుడా (2)
స్నేహితుడా నా స్నేహితుడా
నా ప్రియుడా నా ప్రాణ నాథుడా (2)

English Lyrics

Audio

దేవా మహోన్నతుడా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


దేవా మహోన్నతుడా
మహిమా ప్రకాశితుడా (2)
పదివేలలో అతి సుందరుడా
కీర్తింతు మనసారా (2)         ||దేవా||

వెలిసావు భువిలో మెస్సయ్యగా
ఎడారి బ్రతుకులో సెలయేరుగా (2)
నిస్సారమైన నా జీవితములో
చిగురించె ఆనందము (2)          ||దేవా||

లేచాను ఒంటరి విశ్వాసినై
వెదికాను నీ దారి అన్వేషినై (2)
నీ దివ్య మార్గము దర్శించినా
ఫలియించె నా జన్మము (2)        ||దేవా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME