ఎంత పాపినైనను

పాట రచయిత: ఎర్డ్మాన్ న్యూమీస్టెర్
అనువాదకుడు: అల్లూరి పెదవీరాస్వామి
Lyricist: Erdmann Neumeister
Translator: Alluri Peda Veeraaswaami

Telugu Lyrics

ఎంత పాపినైనను
యేసు చేర్చుకొనును
అంచు నీ సువార్తను
అంత జాటించుడి

హల్లెలూయ హల్లెలూయ
ఎంత పాపినైనను
యేసు చేర్చుకొనున
టంచు బ్రకటించుడి

మెండుగా క్షమాపణన్
పూర్ణ సమాధానము
నెంత పాపి కైన దా
నిచ్చి చేర్చుకొనును     ||హల్లెలూయ||

తన దివ్య సిల్వచే
దీసి పాప శాపమున్
నను బవిత్రపర్చెను
నాకు హాయి నిచ్చెను     ||హల్లెలూయ||

ఘోర పాపినైనను
నన్ను జేర్చుకొనును
పూర్ణ శుద్ధి నిచ్చును
స్వర్గమందు జేర్చును     ||హల్లెలూయ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

సువార్తను ప్రకటింపవా

పాట రచయిత: సామ్ జె వేదాల
Lyricist: Sam J Vedala

Telugu Lyrics


సువార్తను ప్రకటింపవా
సునాదము వినిపింపవా
సిలువను ధరియించవా
దాని విలువను వివరింపవా
లెమ్ము సోదరా
లేచి రమ్ము సోదరీ (2)        ||సువార్తను||

సుఖము సౌఖ్యము కోరి నీవు
సువార్త భారం మరచినావు (2)
సోమరివై నీవుండి
స్వామికి ద్రోహం చేయుదువా (2)        ||లెమ్ము||

నీలోని ఆత్మను ఆరనీకు
ఎదలో పాపము దాచుకోకు (2)
నిను నమ్మిన యేసయ్యకు
నమ్మక ద్రోహం చేయుదువా (2)        ||లెమ్ము||

English Lyrics

Audio

తార వెలిసింది

పాట రచయిత: పి సతీష్ కుమార్
Lyricist: P Satish Kumar

Telugu Lyrics


తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది
దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది (2)
రాజులకు రాజు పుట్టాడని
యూదుల రాజు ఉదయించాడని (2)         ||తార||

మందను విడచి మమ్మును మరచి
మేమంతా కలిసి వెళ్ళాములే
ఆ ఊరిలో ఆ పాకలో
స్తుతి గానాలు పాడాములే (2)
సంతోషమే ఇక సంబరమే
లోక రక్షణ ఆనందమే
స్తోత్రార్పణే మా రారాజుకే
ఇది క్రిస్మస్ ఆర్భాటమే         ||తార||

బంగారమును సాంబ్రాణియు
బోళంబును తెచ్చాములే
ఆ యింటిలో మా కంటితో
నిను కనులారా గాంచాములే (2)
మా ఇమ్మానుయేలువు నీవేనని
నిను మనసారా కొలిచాములే
మా యూదుల రాజువు నీవేనని
నిను ఘనపరచి పొగిడాములే        ||తార||

English Lyrics

Audio

చూచుచున్నాము నీ వైపు

పాట రచయిత: పులిపాక జగన్నాధము
Lyricist: Pulipaaka Jagannaathamu

Telugu Lyrics


చూచుచున్నాము నీ వైపు
మా ప్రియ జనక – చూచుచున్నాము నీ వైపు
చూచుచు నీ ప్రేమ – సొంపు సువార్తను
జాచుచు గరములు – చక్కగా నీవైపు        ||చూచు||

మేమరులమై యుంటిమి
మార్గము వీడి – మేమందరము పోతిమి
ప్రేమచే నప్పుడు – ప్రియ తనయు నంపించి
క్షేమ మార్గము మాకు – బ్రేమను జూపితివి          ||చూచు||

నిను నమ్ము పాపులకు
వారెవరైనా – నీ శరము జొచ్చువారలకు
ఇనుడవు కేడెంబు – నీ జగతిలో నగుచు
గనుపరచుచుందువు – ఘనమైన నీ కృప         ||చూచు||

నీ భయము మాయెదలను
నిలుపుము నీదు – ప్రాభవ మొనరంగను
నీ భయముచే మేము – వైభవ మొందుచు
నే భయము లేకుండ – నీ భువిని గొన్నాళ్ళు         ||చూచు||

దయ జూచి మము నెప్పుడు
మంచివి యన్ని – దయచేయు మెల్లప్పుడు
దయచేయరానివి – దయచేయుమని కోర
దయ జూపి మన్నించు – దయగల మా తండ్రి        ||చూచు||

English Lyrics

Audio

HOME