పాట రచయిత:
Lyricist:
- Telugu Lyrics
- English Lyrics
- Audio
Telugu Lyrics
యేసన్న స్వరమన్నా
నీవెప్పుడైనా విన్నావా (2) ||యేసన్న||
ఏదేను తోటలో ఆదాము చెడగా
ఆ దేవుడే పిలిచె (2)
యెహోవా ఎదుటను ఆదాము దాగిన (2)
అటులనే నీవును దాగెదవా (2) ||యేసన్న||
జనముల శబ్దము జలముల శబ్దము
బలమైన ఉరుములతో (2)
కలిసిన స్వరము పిలిచిన యేసు (2)
పిలిచిన పిలుపును నీవింటివా (2) ||యేసన్న||
ఆనాడు దేవుడు మోషేను పిలువగా
ఆలకించెను స్వరము (2)
ఈనాడు నీవును ఈ స్వరము వినగా (2)
కానాను చేరగా కదిలి రావా (2) ||యేసన్న||