నీ సన్నిధిలో ఈ ఆరాధనను

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

నీ సన్నిధిలో ఈ ఆరాధనను
స్వీకరించుము నా ప్రభువా (2)
నా హృదయములో నీ ఆత్మ బలమును
నింపుము నాపై యేసయ్యా        ||నీ సన్నిధిలో||

ఆవిరివంటి వాడను నేను
మేఘ స్తంభమై నిలిచావు (2)
చల్లని నీ ప్రేమ గాలిని సోకించి (2)
వర్షముగా నను మార్చావు – మార్చావు          ||నీ సన్నిధిలో||

మోడులా మిగిలిన నాకై
సిలువ మ్రానిపై వ్రేళాడి (2)
నీ రక్తముతో నను ప్రోక్షించి (2)
నా మరణ శాపం తొలగించావు – తొలగించావు       ||నీ సన్నిధిలో||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

చిన్ని మనసుతో నిన్ను

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతును
చిన్ని బిడ్డనేసయ్య స్వీకరించుము (2)
నీవే నా ప్రాణము – నీవే నా ధ్యానము (2)
నీవే నా ధ్యానము (2)         ||చిన్ని||

తండ్రి మాటను ధిక్కరించక
తలవంచిన ఇస్సాకు వలే (2)
విధేయతను నేర్పించుము – వినయముగల మనసివ్వుము (2)
వినయముగల మనసివ్వుము (2)         ||చిన్ని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

అనుదినం ఆ ప్రభుని వరమే

పాట రచయిత: జాషువా కొల్లి
Lyricist: Joshua Kolli

Telugu Lyrics

అనుదినం ఆ ప్రభుని వరమే
అనుక్షణం ఆశ్చర్య కార్యమే
ఆనందం-తో స్వీకరించుము
అబ్బురం-తో ఆనందించుము
పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేసిన దేవుడు (2)
నూనెతో నా తలను అంటి దీవెనలతో నింపును            ||అనుదినం||

అనుదినం ఆ ప్రభుని వరమే
అనుక్షణం ఆశ్చర్య కార్యమే
ఆనందం-తో స్వీకరించుము
అబ్బురం-తో ఆనందించుము
తల్లియైనా మరచునేమో మరువడు ప్రభు ఎన్నడూ (2)
ముదిమి వచ్ఛు వరకు నన్ను ఎత్తుకొని కాపాడును           ||అనుదినం||

అనుదినం ఆ ప్రభుని వరమే
అనుక్షణం ఆశ్చర్య కార్యమే
ఆనందం-తో స్వీకరించుము
అబ్బురం-తో ఆనందించుము
నాదు పాపపు భారమెల్ల మోసెను నా దేవుడు (2)
సిలువపై మరణించి నాకు రక్షణిచ్చెను యేసుడు         ||అనుదినం||

English Lyrics

Audio

Download Lyrics as: PPT


HOME