పువ్వు విరిసి రాలినా

పాట రచయిత: ఆర్ ఆర్ కే మూర్తి
Lyricist: R R K Murthy

Telugu Lyrics

పువ్వు విరిసి రాలినా
పరిమళంబు మిగులును (2)
జీవ నీవే తెలుసుకో
నీ జీవితం ఏపాటిదో     ||పువ్వు||

ధరలో కలిమి లేములు
దరి చేరగానే కరగిపోవును (2)
దూరపర్చుమా లౌకికం
చేరు యేసును శీఘ్రమే     ||పువ్వు||

పుడమిలో ఫలియించుమా
ఫలమిచ్చు ద్రాక్షా వల్లిలా (2)
నేల రాలిన పువ్వులా
తేలిపోకుమా గాలిలోన     ||పువ్వు||

భువిలో బ్రతుకుట కన్నను
భగవంత సన్నిధి పెన్నిధి (2)
భారమనక పిలువవే
కోరుకో నువ్వు క్రైస్తవా     ||పువ్వు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఏ గుంపులో నున్నావో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఏ గుంపులో నున్నావో
ఎరిగి తెలుసుకో – గుర్తెరిగి తెలుసుకో (2)
జాగు చేయక వేగ మేలుకో (2)       ||ఏ గుంపులో||

మరణమనెడి మొదటి గుంపు
మారని గుంపు – నిర్జీవపు గుంపు (2)
దురాత్మ బలముతో తిరిగెడి గుంపు (2)       ||ఏ గుంపులో||

మెచ్చుఁకొనుట కిచ్చకంబు
లాడెడి గుంపు – నులివెచ్చని గుంపు (2)
చచ్చియుండిన సమాధుల గుంపు (2)       ||ఏ గుంపులో||

కరుణ లేక కఠినమైన
కరుగని గుంపు – గుర్తెరుగని గుంపు (2)
కరకు కల్గిన కఠోరపు గుంపు (2)       ||ఏ గుంపులో||

యేసు వాక్యమనగ నేమో
ఎరుగని గుంపు – విననియ్యని గుంపు (2)
ముద్ర వేసిన మూర్ఖుల గుంపు (2)       ||ఏ గుంపులో||

ధరణి నరుల తరిమి కొట్టు
దయ్యపు గుంపు – అదే కయ్యపు గుంపు (2)
పరమ తండ్రిని ఎదిరించెడి గుంపు (2)       ||ఏ గుంపులో||

పరమ తండ్రి కడకు జేర
పరుగులెత్తెడి – నిరపరాధ జనులకు (2)
కావలి కాయు కఠినాత్ముల గుంపు (2)       ||ఏ గుంపులో||

సర్వ లోక మోసగాడు
ఆది సర్పము – అదే ఘట సర్పము (2)
సర్వ భక్తుల బరి మార్చెడి గుంపు (2)       ||ఏ గుంపులో||

వధువు మంద మేయు మర్మ
మనగ గమనిక – గమనించి తెలుసుకో (2)
గదిలో చేరుకో పదిలపర్చుకో (2)       ||ఏ గుంపులో||

English Lyrics

Audio

ఎవరితో నీ జీవితం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ఎవరితో నీ జీవితం – ఎందాక నీ పయనం
ఎదలో ప్రభు వసింపగా – ఎదురు లేదు మనుగడకు (2)

దేవుడే నీ జీవిత గమ్యం
దేవ రాజ్యం నీకే సొంతం
గురి తప్పక దరి చేరుమురా
తెలుసుకో ఈ జీవిత సత్యం (2)       ||ఎవరితో||

కష్టాలకు కృంగిపోకురా
నష్టాలకు కుమిలిపోకురా
అశాంతిని చేరనీకురా
తెలుసుకో ఈ జీవిత సత్యం (2)       ||ఎవరితో||

గెలుపోటమి సహజమురా
దివ్య శక్తితో కదులుమురా
ఘన దైవం తోడుండునురా
తెలుసుకో ఈ జీవిత సత్యం (2)       ||ఎవరితో||

English Lyrics

Audio

నీ జీవితం నీటీ బుడగా

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

నీ జీవితం నీటీ బుడగా వంటిది
ఎప్పుడూ ఆగునో మనకూ తెలియదూ (2)
నేడే తెలుసుకో నిజమైన దేవుని
నిత్య జీవముకై వెంబడించు యేసుని      ||నీ జీవితం||

ఎన్నాళ్ళూ ఈ వ్యర్ధపు ప్రయాసము
మనకై మరణించిన ప్రభుని చూడు (2)
ఈ క్షణమే వెదుకూ నీ హృదయముతో (2)
మనదగునూ.. ఆయన క్షమా రక్షణ (2)      ||నీ జీవితం||

ఎన్నాళ్ళు ఈ వ్యర్ధపు ప్రయాణము
త్వరగా రానైయున్నాడు ప్రభువూ (2)
ఆయనతో పరమునకేగుటకూ (2)
నిరీక్షణ గలవారమైయుందుము (2)       ||నీ జీవితం||

English Lyrics

Audio

 

 

కొండ కోన లోయలోతుల్లో

పాట రచయిత: ప్రభు భూషణ్
Lyricist: Prabhu Bushan

Telugu Lyrics

కొండ కోన లోయలోతుల్లో… ఓ ఓ
వినబడుతుంది నా యేసుని స్వరమే
తెలుసుకో నేస్తమా యేసే నిజ దైవం
ప్రభు యేసే మన రక్షణ ప్రాకారం || కొండ కోన ||

నీ హృదయమనే ద్వారమున నిలుచున్నాడు నా యేసు
హృదయమందు చేర్చుకో నేస్తమా (2)
ఏ స్థితికైనా చాలిన దేవుడు నా యేసేనయ్య
నీ స్థితిని ఎరిగిన దేవుడు నా యేసేనయ్య (2)
నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2)     ||కొండ కోన ||

ఆకాశానికి భూమికి మధ్య సిలువలో వేలాడెను నా యేసు
నిన్ను రక్షించాలని (2)
కలువరి సిలువలో తన రక్తమును కార్చెను యేసయ్య
తన రాజ్యములో నిను చేర్చుటకు పిలిచెను యేసయ్య (2)
నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2)     ||కొండ కోన ||

English Lyrics

Audio

రెండే రెండే దారులు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


రెండే రెండే దారులు
ఏ దారి కావాలో మానవా
ఒకటి పరలోకం మరియొకటి పాతాళం (2)
పరలోకం కావాలో పాతాళం కావాలో
తెలుసుకో మానవా (2)

పరలోకం గొప్ప వెలుగుతో
ఉన్నాది పరిశుద్ధుల కోసం (2)
సూర్యుడుండడు చంద్రుడుండడు
చీకటుండదు రాత్రియుండదు
నిత్యుడైన యేసుడే ప్రకాశించుచుండును (2)
యుగయుగములు పరలోక రాజ్యమేలుచుండును (2)
యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతావు (2)      ||రెండే||

పాతాళం అగ్ని గుండము
ఉన్నాది ఘోరపాపుల కోసం (2)
అగ్ని ఆరదు పురుగు చావదు
గప్పగప్పున రగులుచుండును
ధనవంతుడు మరణించి అగ్నిలో ఉన్నాడు (2)
అబ్రహాము రొమ్ముపై లాజరును చూసాడు (2)
ధనవంతుడు చూసి ఆశ్చర్యపడ్డాడు (2)       ||రెండే||

పుడతావు నీవు దిగంబరిగా
వెళతావు నీవు దిగంబరిగా (2)
గాలి మేడలు ఎన్నో కడతావు
నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు
లోకంలో ఘోరమైన పాపాలు చేస్తావు (2)
ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి (2)
అగ్నిలో పడకుండా యేసు ప్రభుని నమ్ముకో (2)         ||రెండే||

English Lyrics

Audio

 

 

HOME