కానెన్నడు నేను అనాథను

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


కానెన్నడు నేను అనాథను
అయ్య కానెన్నడు నేను అనాథను (2)
(నా) కన్నీరు తుడచువాడా
నేనున్నానని అనువాడా (2)      ||కానెన్నడు||

అమ్మ నాన్న దూరమైనా
బంధువులే వెలివేసినా (2)
నా అమ్మ నాన్న నీవే యేసయ్యా
నా తోడు నీడ నీవే యేసయ్య (2)      ||కానెన్నడు||

వెక్కి వెక్కి ఏడుపొచ్చినా
వెక్కిరింతల పాలైనా (2)
నా కన్నీరు తుడచువాడా
నేనున్నానని అనువాడా (2)      ||కానెన్నడు||

వ్యాధి బాధలవరించినా
రోగములతో కృంగదీసినా (2)
నా వైద్యుడవు నీవే యేసయ్యా
నన్ను స్వస్థపరచువాడవు నీవే (2)      ||కానెన్నడు||

English Lyrics

Audio

HOME