నీలో జీవించాలని

పాట రచయిత: కే వై రత్నం
Lyricist: K Y Ratnam

Telugu Lyrics

నీలో జీవించాలని
నీలోనే బ్రతకాలని (2)
యుగయుగాల నీతోనే ఉండాలని (2)
తుది శ్వాస వరకు నీలోనే నా గమ్యం (2)
యేసూ నువ్వే కావాలి
నా యేసూ నీతో ఉండాలి (2)            ||నీలో||

మిగిలింది నాకు నిత్య శోకము
ఈ నా జీవిత యాత్రలో
కన్నీళ్లే నాకు అన్న పానములై
భుజియించుచుంటిని నిత్యము ప్రభువా (2)
నీవు నాకు ప్రత్యక్షము అయిన వెంటనే (2)
నా దుఃఖ దినములన్ని సమాప్తమాయెను (2)             ||యేసూ||

కటిక చీకటే నాకు స్నేహమాయెను
అంధకారమే నాలో నాట్యమాడెను
ఎటు వైపు చూసినా వెలుగు కాన రాలేదు
మార్గమే తెలియక మతి చెలించెను (2)
నీ వైపు చూడగానే వెలుగు కలిగె దేవా (2)
నీ నామమే నాకు మార్గమాయెను (2)             ||యేసూ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME