గాలించి చూడరా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


గాలించి చూడరా మేలైనది
నీలోన ఉన్నదా ప్రేమన్నది
ప్రేమన్నది నీ పెన్నిధి (2)
నీలోన ఉన్నదా ప్రేమన్నది (2)

దేవ దూతలా భాషలు దేనికి
కరుణ లేని నీ కఠిన ముఖానికి (2)
పైకి భక్తి కలిగినా చాలదు
ప్రేమ లేని భక్తి అది వ్యర్ధము (2)         ||గాలించి||

బీదలకు ఆస్తినిచ్చి పంచినా
కార్చుటకు శరీరం మార్చినా (2)
రేయి పగలు ఏడ్చుచు ప్రార్ధించినా
రిక్తుడవే నీ శ్రమంతా వ్యర్ధము (2)         ||గాలించి||

కొండలు పెకిలించు విశ్వాసివా
గుండెలు కరిగించు సహవాసివా (2)
ప్రేమలేని విశ్వాసము శూన్యము
చివరికది మరో మృతము తథ్యము (2)         ||గాలించి||

స్వస్థపరచు వరాలున్న దేనికి
స్వస్థతయే లేదు నీకు నేటికీ (2)
ప్రేమలేని వరాలన్ని సున్నా
క్షేమమేదిరా నీకు రన్నా (2)         ||గాలించి||

గణ గణ మ్రోగెడి లోహానివా
కంచువై మ్రోగెడి మేళానివా (2)
డంబమెరుగదు మోగదు మేలిమి
పొంగదు ప్రేమ ఋణము తాలిమి (2)         ||గాలించి||

ధర్మశాస్త్రమంతటికాధారము
దశాజ్ఞలలో గొప్ప సారము (2)
ప్రేమయే అది యేసుని రూపము
లేనిదైతే వచ్చుఁ ఘోర శాపము (2)         ||గాలించి||

ప్రేమ విశ్వాసము నిరీక్షణ
ఓ ప్రియుడా నీకిచ్చును రక్షణ (2)
వీటిలో ప్రేమయే శ్రేష్టము
పాటించితే నీకింక మోక్షము (2)         ||గాలించి||

English Lyrics

Audio

అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న

పాట రచయిత: సామ్యేల్ గోడి
Lyricist: Samuel Godi

Telugu Lyrics

అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న
అన్న బైబిల్ మాట ఉన్నదా జ్ఞాపకం
ఉన్నదా జ్ఞాపకం        ||అన్నిటి||

శోధనలోనికి మీరు జారిపడకుండాలంటే (2)
మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో (2)          ||అన్నిటి||

శాంతి లోపల మీకు సుఖము లోకములోన (2)
కలిగి బ్రతకాలంటే కావాలి ప్రార్థన (2)         ||అన్నిటి||

English Lyrics

Audio

నీవు ప్రార్థన చేయునప్పుడు

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics

నీవు ప్రార్థన చేయునప్పుడు
అడుగుచున్న వాటిని
పొందియున్నాననే నమ్మకమున్నదా నీకు (2)

నమ్మిక లేకయే నీవు చేసే ప్రార్థన
తండ్రి సన్నిధి చేరదని గుర్తెరుగుమా నేడు (2)
నమ్ముట నీ వల్ల అయితే నమ్ము వానికి అన్నియు
సాధ్యమేనని చెప్పిన మాట మరచితివా (2)
ప్రభు మాట మరచితివా          ||పొందియున్నాననే||

బాధలు ఇబ్బందులు నిన్ను చుట్టిన వేళలో
విశ్వాస ప్రార్థనా బలము మరచితివా (2)
సింహాల బోనులోన ప్రార్థించిన దానియేలు
నమ్మి పొందిన భయము లేని జయము మరచితివా (2)
ఆ జయము మరచితివా         ||పొందియున్నాననే||

గెత్సేమనే తోటలో కన్నీటి ప్రార్థన
ఆంతర్యమును గ్రహియించుమా నేడు (2)
సొంత చిత్తము కాకయే తండ్రి చిత్తము నెరవేర్చి
ప్రభువు మనకు నొసగెను రక్షణానందం (2)
ఈ రక్షణానందం            ||పొందియున్నాననే||

English Lyrics

Audio

HOME