పాట రచయిత:
Lyricist:
Telugu Lyrics
వాడబారని విశ్వాసముతో
శుభప్రదమైన నిరీక్షణతో (2)
వేచియున్నానయ్యా కనిపెట్టుచున్నానయ్యా (2) యేసయ్యా
నీ రాక కోసమై – కడబూర శబ్దముకై
నీ మహిమ కోసమై – నిన్ను చేరుటకై (2) ||వాడబారని||
మోకాళ్లపై వేచితి – కన్నీళ్ల పర్యంతమై
బీడు బారిన నేల వానకై – ఎదురు చూచినా సంఘమై (2)
సిద్ధపడియున్న వధువునై
ఆశతో వేచానయ్యా (2) యేసయ్యా ||నీ రాక||
లేఖనములను చూచితి – గురుతులు గమనించితి
ప్రవచన నెరవేర్పులన్ని – జరుగుట గుర్తించితి (2)
రారాజువై నీవు రావాలని
ఎదురు చూచుచున్నానయ్యా (2) యేసయ్యా ||నీ రాక||
నీటి కొరకై వేచిన – గూడ బాతును పోలిన
ఆత్మ దాహము తోడనిండి – అల్లాడుచున్నానయ్యా (2)
లోక బంధాల నుండి
నీ చెలిమి కోరానయ్యా (2) యేసయ్యా ||నీ రాక||
English Lyrics
Vaadabaarani Vishwaasamutho
Shubhapradamaina Nireekshanatho (2)
Vechiyunnaanayyaa Kanipettuchunnanayyaa (2) Yesayyaa
Nee Raaka Kosamai – Kadaboora Shabdamukai
Nee Mahima Kosamai – Ninnu Cherutakai (2) ||Vaadabaarani||
Mokaallapai Vechithi – Kanneella Paryanthamai
Beedu Baarina Nela Vaanakai – Eduru Choochina Sanghamai (2)
Siddhapadiyunna Vadhuvunai
Aashatho Vechaanayyaa (2) Yesayyaa ||Nee Raaka||
Lekhanamulanu Choochithi – Guruthulu Gamaninchithi
Pravachana Neraverpulanni – Jaruguta Gurthinchithi (2)
Raaraajuvai Neevu Raavaalani
Eduru Choochuchunnaanayyaa (2) Yesayyaa ||Nee Raaka||
Neeti Korakai Vechina – Gooda Baathunu Polina
Aathma Daahamu Thodanindi – Allaaduchunnanayyaa (2)
Loka Bandhaala Nundi
Nee Chelimi Koraanayyaa (2) Yesayyaa ||Nee Raaka||
Audio
Download Lyrics as: PPT