యేసు రాజ్యమునకు సైనికులం

పాట రచయిత: సాయారం గట్టు
Lyricist: Sayaram Gattu

Telugu Lyrics


యేసు రాజ్యమునకు సైనికులం
పరమునకు మనమే వారసులం (2)
ప్రేమ పంచిన దేవుని శిష్యులం
ఎదురు బెదురూ ఎరుగని వారలం (2)

కారు చీకటి కమ్మిన లోకము
కాదు మన ప్రభువుకు సమ్మతము
ఆత్మలు నశియించుట ఘోరము
వారి రక్షణయే మన భారము (2)
వెలుగే మనమని సెలవిచ్ఛేనని
అప్పగించిన పని జరిగింతుము (2)      ||ప్రేమ పంచిన||

వలదు నీ మదిలో సందేహము
ప్రభువే పెంచునుగా నీ జ్ఞానము
తగిన రీతి తలాంతులు నొసగును
నిన్ను అద్భుత పాత్రగా మలచును (2)
నీకు భారము మదిలో మెదిలితే
ప్రభువే మార్గము చేయును సరళము (2)      ||ప్రేమ పంచిన||

నీవు పొందిన సువార్త ఫలము
ఇతరులకు పంచుటయే ఘనము
సాక్ష్యమును చాటించే ధైర్యము
లోకమునకు చూపించును నిజము (2)
కోత ఎంతగ ఉంది విరివిగా
కోయుదాము ప్రభు పనివారుగా (2)      ||ప్రేమ పంచిన||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

దేవుని వారసులం

పాట రచయిత: ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Lyricist: Andhra Kraisthava Keerthanalu

Telugu Lyrics


దేవుని వారసులం – ప్రేమ నివాసులము
జీవన యాత్రికులం – యేసుని దాసులము
నవ యుగ సైనికులం – పరలోక పౌరులము
హల్లెలూయ – నవ యుగ సైనికులం – పరలోక పౌరులము       ||దేవుని||

సజీవ సిలువ ప్రభు – సమాధి గెలుచుటకే
విజేత ప్రేమికులం – విధేయ బోధకులం
నిజముగ రక్షణ ప్రబలుటకై
ధ్వజముగ సిలువను నిలుపుదుము (2)      ||దేవుని||

ప్రభువును చూచుటకై ప్రజలందరు రాగా
విభు మహిమను గాంచ – విశ్వమే మేము గోల
శుభములు గూర్చుచు మాలోన
శోభిల్లు యేసుని చూపుదుము (2)      ||దేవుని||

దారుణ హింస లలో – దేవుని దూతలుగా
ఆరని జ్వాలలలో – ఆగని జయములతో
మారని ప్రేమ సమర్పణతో
సర్వత్ర యేసుని కీర్తింతుము (2)      ||దేవుని||

పరిశుద్దాత్మునికై – ప్రార్థన సలుపుదము
పరమాత్ముని రాక – బలము ప్రసాదింప
ధరణిలో ప్రభువును జూపుటకై
సర్వాంగ హోమము జేయుదము (2)      ||దేవుని||

అనుదిన కూటములు – అందరి గృహములలో
ఆనందముతోను – ఆరాధనలాయే
వీనుల విందగు పాటలతో
ధ్యానము చేయుచు మురియుదము (2)      ||దేవుని||

హత సాక్షుల కాలం – అవనిలో చెలరేగ
గతకాలపు సేవ – గొల్గొతా గిరి జేర
భీతులలో బహు రీతులలో
నూతన లోకము కాంక్షింతుము (2)       ||దేవుని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME