చూపుల వలన కలిగేది

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


చూపుల వలన కలిగేది ప్రేమ కాదమ్మా
ఆకర్షణకు లొంగిపోయి బానిస కాకమ్మా
చూపుల వలన కలిగేది ప్రేమ కాదురా
ఆకర్షణకు లొంగిపోయి బానిస కాకురా
స్వార్ధ్యంతోనే నిండియున్నది లోక ప్రేమరా
సత్యమైనది పవిత్రమైనది యేసు ప్రేమరా (2)

తల్లిదండ్రులు నిన్ను గొప్ప చేయాలని
కష్టించి చెమటోడ్చి డబ్బంతా నీకే పెడితే (2)
కన్నందుకు కన్నీరేనా ప్రతిఫలం
పద్దు గీసుకోవటమా నీ జీవితం (2)
వ్యర్ధమైనవాటిని విడిచి
పరమార్ధంలోకి నడిచి
దైవ యేసు వాక్యం స్వీకరించుమా (2)        ||చూపుల||

English Lyrics

Audio

నావన్ని యంగీకరించుమీ

పాట రచయిత: పులిపాక జగన్నాథము
Lyricist: Pulipaaka Jagannaathamu

Telugu Lyrics

నావన్ని యంగీకరించుమీ దేవా – నన్నెప్పుడు నీవు కరుణించుమీ
నావన్ని కృపచేత నీవలన నొందిన (2)
భావంబునను నేను బహుదైర్యమొందెద        ||నావన్ని||

నీకు నా ప్రాణము నిజముగా నర్పించి (2)
నీకు మీదుగట్టి నీ కొరకు నిల్పెద         ||నావన్ని||

సత్యంబు నీ ప్రేమ చక్కగా మది బూని (2)
నిత్యంబు గరముల నీ సేవ జేసెద          ||నావన్ని||

నీ సేవ జరిగెడు నీ ఆలయమునకు (2)
ఆశచే నడిపించు మరల నా పదములు          ||నావన్ని||

పెదవులతో నేను బెంపుగ నీ వార్త (2)
గదలక ప్రకటింప గలిగించు దృఢ భక్తి          ||నావన్ని||

నా వెండి కనకంబు నా తండ్రి గైకొనిమీ (2)
యావంత యైనను నాశింప మదిలోన         ||నావన్ని||

నీవు నా కొసగిన నిర్మల బుద్దిచే (2)
సేవ జేయగ నిమ్ము స్థిర భక్తితో నీకు        ||నావన్ని||

చిత్తము నీ కృపా యత్తంబు గావించి (2)
మత్తిల్ల కుండగ మార్గంబు దెలుపుము       ||నావన్ని||

హృదయంబు నీకిత్తు సదనంబు గావించి (2)
పదిలంబుగా దాని బట్టి కాపాడుము         ||నావన్ని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME