నీవే నీవే నన్ను పిలిచిన

పాట రచయిత: షారోన్
Lyricist: Sharon

Telugu Lyrics

నీవే నీవే.. నన్ను పిలిచిన స్వరము
నన్ను కలిసిన వరము (2)
స్తుతి గాన సంపద నిన్ను చేరాలని
నా దీన మనస్సు నీవే చూడాలని
ప్రయాసతో ప్రయాణమైతిని       ||నీవే||

నీ తోడు నాకుండగా – ఏ దిగులు నాకుండదు
నీ చెలిమి నాకుండగా – కన్నీరే నాకుండదు (2)
ప్రతి కీడు తప్పించు – పరిశుద్ధ గ్రంథం
నా కొరకే పంపావయ్యా
ఏ చోటనైనా – ఏ పల్లెనైనా
నీ పలుకే బంగారమాయెనయా        ||నీవే||

నోవాహును నడిపిన – నావికుడు నీవేనయ్యా
సంద్రాన్ని చల్లార్చిన – ఆ శక్తి నీదేనయ్యా (2)
దావీదు ప్రార్ధన – ఆ యోబు వేదన
కనిపెట్టి చూసావయ్యా
నా దుఃఖ భారం – నా శాప భారం
నీలోనే కరగాలయ్యా          ||నీవే||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

యేసు జననము

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసు జననము లోకానికెంతో వరము
ఆనంద గానాల క్రిస్మస్ దినము (2)
ఆహాహహా హల్లెలూయా… ఓహోహొహో హోసన్నా (2)

బెత్లెహేములో పశులపాకలో
పొత్తిళ్ళలో మరియ ఒడిలో (2)
పవళించినాడు ఆనాడు
నీ హృదిని కోరాడు నేడు (2)          ||ఆహాహహా||

గొల్లలంతా పూజించిరి
జ్ఞానులంతా ఆరాధించిరి (2)
అర్పించుము నీ హృదయం
ఆరాధించుము ప్రభు యేసున్ (2)      ||ఆహాహహా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME