ఏ రీతి స్తుతియింతును

పాట రచయిత: తాతపూడి జ్యోతి బాబు
Lyricist: Thathapudi Jyothi Babu

Telugu Lyrics


ఏ రీతి స్తుతియింతును – ఓ యేసూ నాథా దైవమా
ఏ రీతి వర్ణింతును – నీ ప్రేమ మధురంబును
నీ కృపలన్ని తలపోసుకొనుచు – నీ పాదాలు చేరానయ్యా
నీకు కృతజ్ఞతలు చెల్లింప మదిలో – నా కన్నీళ్లు మిగిలాయయ్యా            ||ఏ రీతి||

ఏకాకినై నే దుఃఖార్తిలో – ఏ తోడు గానని నాకు
ఏమౌదునో ఎటు పోదునో – ఎటు తోచక నున్న నన్ను
ఏ భయము నీకేల యనుచు – అభయంబు నిచ్చావయ్యా
ఏ దారి కనబడని వేళ – నీ ఒడిలోపు దాచావయ్యా        ||ఏ రీతి||

ఈ మనుష్యులు ఈ వైరులు – ఎన్నెన్నో చేసిన గాని
నా ప్రాణము నా దేహము – నీ స్వాధీనంభేగదయ్యా
నా స్వామి నాతోనే ఉంటూ – నా కాపరిగ నిలిచావయ్యా
నాకేమి స్పృహ లేని వేళ – ఊపిరిని పోసావయ్యా           ||ఏ రీతి||

నీ ప్రేమను నీ పేరును – నేనెన్నడూ మరువలేను
నీ కరుణను నీ జాలిని – ఏ మనిషిలో చూడలేను
నిజ దైవము నీవే యనుచు – నీ వైపే నే చూచానయ్యా
యెహోవా రాఫా నేననుచు – ఈ స్వస్థతను ఇచ్చావయ్యా          ||ఏ రీతి||

English Lyrics

Audio

స్నేహితుడా నా హితుడా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


స్నేహితుడా నా హితుడా
నన్ను మరువని బహు ప్రియుడా
నన్ను విడువని నా హితుడా
ఏమని నిన్ను వర్ణింతును
నీ ప్రేమకు నేను ఏమిత్తును (2)    ||స్నేహితుడా||

కారుచున్న కన్నీరు తుడిచి
పగిలియున్న గుండెను ఓదార్చి (2)
ఆదరించిన స్నేహితుడా
నన్నోదార్చిన నా హితుడా (2)
నన్ను ఓదార్చిన నా హితుడా       ||స్నేహితుడా||

మోడుగున్న బ్రతుకును చిగురించి
గూడు చెదరిన నన్ను దరి చేర్చి (2)
కృపను చూపిన స్నేహితుడా
కనికరించిన నా హితుడా (2)
నన్ను కరుణించిన నా హితుడా     ||స్నేహితుడా||

English Lyrics

Audio

వర్ణించలేను వివరించలేను

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


వర్ణించలేను వివరించలేను
యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2)
యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2)

పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు
పాడైపోయిన నన్ను బాగు చేసినావు (2)
ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను       ||యేసయ్యా||

అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు
ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు (2)
ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను       ||యేసయ్యా||

తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను
ఆదరించినావు ఓదార్చినావు (2)
ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను        ||యేసయ్యా||

English Lyrics

Audio

 

 

HOME