ఈ దినమెంతో శుభ దినము

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఈ దినమెంతో శుభ దినము
నూతన జీవితం అతి మధురం
ఆగదు కాలం మన కోసం
గతించిపోయెను చెడు కాలం
వచ్చినది వసంత కాలం     ||ఈ దినమెంతో||

నీ హృదయం ఆశలమయము
కావాలి అది ప్రేమ నిండిన మందిరము (2)
యేసుని కొరకై తెరచిన హృదయం
ఆలయం అది దేవుని నిలయం       ||ఈ దినమెంతో||

జీవితమే దేవుని వరము
తెలియాలి అది ముగియక ముందే రక్షణ మార్గం (2)
నూతన జీవము నింపుకొని
నిలవాలి అది క్రీస్తుకు సాక్ష్యం      ||ఈ దినమెంతో||

English Lyrics

Audio

జగతికి వెలుగును తెచ్చెనులే

పాట రచయిత: సిరివెళ్ల హనోక్
Lyricist: Sirivella Hanok

Telugu Lyrics


జగతికి వెలుగును తెచ్చెనులే – క్రిస్మస్ క్రిస్మస్
వసంత రాగం పాడెనులే – క్రిస్మస్ క్రిస్మస్
రాజుల రాజు పుట్టిన రోజు – క్రిస్మస్ క్రిస్మస్
మనమంతా పాడే రోజు – క్రిస్మస్ క్రిస్మస్ (2)

ఈ రాత్రిలో కడు దీనుడై
యేసు పుట్టెను బెత్లెహేములో (2)
తన స్థానం పరమార్ధం విడిచాడు నీకై
నీ కోసం నా కోసం పవళించే పాకలో (2)        ||జగతికి||

ఇమ్మానుయేలుగా అరుదించెను
దైవ మానవుడు యేసు దేవుడు (2)
నీ తోడు నా తోడు ఉంటాడు ఎప్పుడు
ఏ లోటు ఏ కీడు రానీయదు ఎన్నడు (2)         ||జగతికి||

English Lyrics

Audio

HOME