తారా వెలిసెను ఈ వేళ

పాట రచయిత: సాయారం గట్టు
Lyricist: Sayaram Gattu

Telugu Lyrics


తారా వెలిసెను ఈ వేళ
యేసు పుట్టిన శుభవేళ (2)
వెలిగెను ఈ లోకం – మదిలో నిండెను ఆనందం
తరగని రక్షణను – మనకై తెచ్చెను ఆ దైవం (2)
రండి వార్తను చాటుదాము
ఆ రక్షణను పంచుదాము (2)      ||తారా||

పశుల పాకే పావనమాయె
మంద గొల్లలే తన వారాయె (2)
జ్ఞానులొచ్చిరి ఆరాధింప
రాజులలో భీతిని నింప (2)      ||తారా||

పాపమెరుగని నీతి పరుడు
లోకమును కాచే రక్షకుడు (2)
కన్య మరియా గర్భమున
పుట్టెను దేవుని అంశమున (2)      ||తారా||

రాజులకు రాజైన తనకు
ఇచ్చుటకు ఏమున్నది మనకు (2)
వెండి బంగారముల కన్నా
హృదములనర్పిస్తే మిన్నా (2)      ||తారా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

అమ్మ కోసం

పాట రచయిత: స్వప్న ఎడ్వర్డ్స్
Lyricist: Swapna Edwards

Telugu Lyrics

ఏ భాషకందని భావం నీవు
వెలకట్టలేని ముత్యం నీవు
దేవుడిచ్చిన వరమే నీవు తీర్చలేని ఓ ఋణం
ఎదలో దాగిన పలుకే నీవు నా ప్రేమకు తొలిరూపం
అమ్మా నిను మించిన బంధం ఏదియు లేదే
లోకంలో ఈ తీయని బంధం కానరాలేదే

నవ మాసాలు నీలో నన్ను దాచావు
నా ఊపిరికి ప్రాణం పణంగా పెట్టావు
రేయి పగలంతా నాకై శ్రమపడినా
తీరని అనురాగం నీలో దాచావే
నీ సుఖ సంతోషం వదిలిన నాకై
తరగని మమకారం నీలో చూసానే
యేసయ్య ప్రేమే నిన్ను నాకై సృష్టించిందే
అమ్మా నిను మించిన బంధం ఇలలో లేనే లేదే
లోకంలో ఈ తీయని బంధం కానరానే లేదే

భయ భక్తులే ఉగ్గి పాలుగా పోసావు
దేవుని మాటలే గోరు ముద్దగా చేసావు
తప్పటడుగులే నాలో సరి చేసి
ప్రభు సన్నిధిలో నన్ను సాక్షిగా నిలిపావు
ప్రతి వేకువలో నాకై నీవు
చేసే ప్రార్థనలే పెంచెను నా బలమే
నీలో కలిగిన విశ్వాసం నాతో సహవాసించెనే
అమ్మా నిను మించిన బంధం ఇలలో లేనే లేదే
లోకంలో ఈ తీయని బంధం కానరానే లేదే          ||ఏ భాషకందని||

English Lyrics

Audio

మనసులొకటాయే భువిలో

పాట రచయిత: మైఖెల్ కళ్యాణపు
Lyricist: Michael Kalyanapu

Telugu Lyrics


మనసులొకటాయే భువిలో
ఇరువురొకటాయే హృదిలో (2)
మనసు పరవశమై మధుర లాహిరిలో (2)
మనసులోని భావాలు
ఉరకలు వేసే ఈ వేళా        ||మనసులొకటాయే||

ఎవరికెవరొక నాడు ఈ క్షణాన ఇచ్చోట
దేవ దేవుని సంకల్పం ఈ శుభ ఘడియా (2)
ఈ మధురమైన శుభవేళ (2)
ఒకరికొకరు తోడు నీడగా
సాగే ఈ తరుణం        ||మనసులొకటాయే||

అనురాగం నీ ప్రాణమై అభిమానం నీ స్నేహమై
జీవితాంతం ఒకరికొకరు ప్రేమ మూర్తులుగా (2)
ఘన యేసుని దివ్య ఆశీస్సు (2)
జీవితాంతం నిండుగ మెండుగ
నీతో నిలిచే ఈ తరుణం        ||మనసులొకటాయే||

English Lyrics

Audio

యాకోబు బావి కాడ

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యాకోబు బావి కాడ యేసయ్యను చూసానమ్మా
ఎండా వేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా (2)
దాపు చేరి నన్ను చూసి దాహమని అడిగాడమ్మా (2)
నేనిచ్చుఁ నీళ్లు నీకు ఎన్నడు దప్పిక కావన్నాడే (2)       ||యాకోబు||

అయ్యా నే సమరయ స్త్రీని – మీరేమో యూదులాయె
మీకు మాకు ఏనాడైనా – సాంగత్యము లేకపాయె (2)
నేనిచ్చుఁ నీళ్లు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా (2)
చేదుటకు ఏమి లేదు నాకెట్లు ఇస్తావయ్యా (2)       ||యాకోబు||

అయినా నీళ్లు నాకు ఇమ్మని నేనడిగానే
నీళ్లు నీకు ఇస్తాగాని నీ భర్తను రమ్మన్నాడే (2)
అయ్యా నే ఒంటరిదాన్ని నాకెవ్వరు లేరన్నానే (2)
లొపేమి ఎరగనట్టు లోగుట్టు దాచినానే (2)       ||యాకోబు||

నీకు భర్త లేడన్నాడే పెనిమిట్లు ఐదుగురుండే
ఇప్పుడున్నవాడు కూడా నీకు భర్త కాదన్నాడే (2)
వివరంగా నా గుట్టంతా విప్పి నాకు చెప్పాడమ్మా (2)
ఆనాటి నుండి నేను ఆయన సాక్షినయ్యానమ్మా (2)       ||యాకోబు||

నా గుట్టు విప్పినవాడు నీ గుట్టు విప్పుతాడు
ఏ తట్టు చూస్తున్నావో లోగుట్టు దాస్తున్నావో (2)
గుట్టు రట్టు కాకముందే తప్పులొప్పుకోవాలమ్మా (2)
తప్పకుండ యేసు ముందు తల వంచి మొక్కాలమ్మా (2)       ||యాకోబు||

English Lyrics

Audio

తెల్లారింది వేళ

పాట రచయిత: శామ్యూల్ కర్మోజి
Lyricist: Samuel Karmoji

Telugu Lyrics


అన్నయ్య… తెల్లారింది లేరా..
తెల్లారింది వేళ – త్వరగా నిద్దుర లేరా
మనమంతా ఆయన సృష్టే రా
పక్షుల కోలాహ వేళ – ప్రభువును స్తుతించావేరా
వాటి కంటె శ్రేష్ఠుల మనమేరా (2)

అడవి రాజు సింహమైననూ – ఆకలంటు పిల్లలన్ననూ
యేసు రాజు పిల్లలం మనం – పస్తులుంచునా (2)
వాడిపోవు అడవి పూలకు – రంగులేసి అందమిచ్చెను
రక్తమిచ్చి కొన్న మనలను – మరచిపోవునా (2)
మరచిపోవునా               ||తెల్లారింది||

చిన్నదైన పిచ్చుకైననూ – చింత ఉందా మచ్ఛుకైననూ
విత్తలేదు కోయలేదని – కృంగిపోవునా (2)
వాటికన్ని కూర్చువాడు – నీ తండ్రి యేసేనని
నీకు ఏమి తక్కువ కాదని – నీకు తెలియునా (2)
నీకు తెలియునా               ||తెల్లారింది||

English Lyrics

Audio

అందాలు చిందే

పాట రచయిత: రమేష్
Lyricist: Ramesh

Telugu Lyrics

అందాలు చిందే శుభ వేళ – అందుకో ఈ వేళ (2)
కోరుకున్నావు ఈ వరుని – చేరియున్నాడు నీ జతనే (2)       ||అందాలు||

చిననాటి పుట్టింటి నడకా
సాగాలి అత్తింటి దాకా (2)
ఎంత ఘనమైన బంధం
వెయ్యేండ్ల వివాహ బంధం (2)       ||అందాలు||

సంసార సాగర పయనం
తెర చాటు అనుభూతి వినయం (2)
సాగిపోవాలి పయనం
చేరుకోవాలి గమ్యం (2)       ||అందాలు||

యేసయ్య పాదాల చెంత
వదలాలి ఎదలోని చింత (2)
క్రీస్తు పుట్టాలి నీలో
చేర్చుకోవాలి హృదిలో (2)       ||అందాలు||

English Lyrics

Audio

కంట నీరేల

పాట రచయిత: సాయారం గట్టు
Lyricist: Sayaram Gattu

Telugu Lyrics


కంట నీరేల? కలతలు ఏల?
యేసుతో నీవు సాగు వేళ
శోధన వేళ రోదన ఏల?
నీ విశ్వసము గెలిచే వేళ (2)
నమ్మిన ఆ దేవుడు – ఎన్నడు మరచిపోడు
నీయొక్క అవసరాలు – ఏనాడో తానెరిగాడు        ||కంట||

వలదు చింతన దేనికైనా
విన్నవించుము నీ నివేదన (2)
పొందితినను నీదు నమ్మకము
దరికి చేర్చును తగిన విజయము (2)
తిరుగన్నదే లేనివి – ఆ తండ్రి దీవెనలు
పొరపాటు ఎరుగనివి – తానిచ్చు ఆ మేలులు (2)        ||కంట||

రేపు గూర్చిన భయము వలదు
ప్రతి దినము తగు బాధ కలదు (2)
నీదు భారము మోయు ఆ దేవుడు
నీకు ముందుగా నడుచు ఎల్లప్పుడు (2)
నీలోని ఆ భయము – లోకానికి ప్రతిరూపం
స్థిరమైన నీ విశ్వాసం – దేవునికి సంతోషం (2)          ||కంట||

English Lyrics

Audio

నాదు జీవితము

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నాదు జీవితము మారిపొయినది
నిన్నాశ్రయించిన వేళ
నన్నాదుకుంటివి ప్రభువా          ||నాదు||

చాలునయ్యా దేవా – ఈ జన్మ ధాన్యమే ప్రభువా (2)
పాప కూపము విడిచి – నీ దారి నడచితి దేవా
నిన్నాశ్రయించితి ప్రభువా..      ||నాదు||

కన్ను గానని దిశగా – బహు దూరమేగితినయ్యా (2)
నీ ప్రేమ వాక్యము వినగా – నా కళ్ళు కరిగెను దేవా
నిన్నాశ్రయించితి ప్రభువా..      ||నాదు||

లోకమంతా విషమై – నరకాగ్ని జ్వాలలు రేగే (2)
ఆ దారి నడపక నన్ను – కాపాడినావని దేవా
నిన్నాశ్రయించితి ప్రభువా..        ||నాదు||

జాలిగల నా ప్రభువా – నీ చేయి చాపవా ప్రభువా (2)
చేరగల నీ దరికి – నే పాపినయ్యా ప్రభువా
నే పాపినయ్యా ప్రభువా..         ||నాదు||

ఆరిపోని జ్యోతివై – కన్నులలోని కాంతివై (2)
ఎంత కాలముంటివి – ఎంతగా ప్రేమించితివి
నన్నెంతగా ప్రేమించితివి..         ||నాదు||

English Lyrics

Audio

HOME