కొంత యెడము నీవైనా

పాట రచయిత: సాయారం గట్టు
Lyricist: Sayaram Gattu

Telugu Lyrics

కొంత యెడము నీవైనా నే సాగలేను
నిమిషమైన నిన్ను విడిచి నే బ్రతుకలేను
కొంత యెడము నీవైనా

మరచిన వేళలో మది నీ పలుకులు
సడలి కట్టడలు మలినము తలపులు (2)
ప్రేమను పంచే ప్రేమ రూపుడా (2)
మరియొక్క మారు మన్నించు విభుడా (2)         ||కొంత యెడము||

కనులకు మోహము కమ్మిన క్షణము
వినుట మరచె నీ స్వరమును హృదయము (2)
కమ్మిన పొరలు కరిగించుటకు (2)
నడుపు నీ వైపుకు హృది వెలుగుటకు (2)         ||కొంత యెడము||

మదము, మత్సరములు సోకిన తరుణము
పాశము, ప్రేమకు విగతము ప్రాప్తము (2)
నిరతము స్థిరముగ నున్న అక్షయుడా (2)
నిలుపుము నీ కృపలో నన్ను రక్షకుడా (2)         ||కొంత యెడము||

మనుజ రూపమున మహిలో నిలిచి
మనిషి-కసాధ్యమౌ మరణము గెలిచి (2)
నను వరియించగ రానున్న ప్రియుడా (2)
నిన్నెదురుకొనగ మతి నియ్యు వరుడా (2)         ||కొంత యెడము||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నీతో నుండని బ్రతుకు

పాట రచయిత: రాజ్ ప్రకాష్ పాల్
Lyricist: Raj Prakash Paul

Telugu Lyrics


నీతో నుండని బ్రతుకు – నిను చూడని క్షణము
ఊహించలేను నా యేసయ్యా
నిను చూడని క్షణము – నీతో నుండని బ్రతుకు
ఊహించలేను నా యేసయ్యా (2)

నీదు స్వరము వినకనే నేను
నిను విడచి తిరిగితి నేను
నాదు బ్రతుకులో సమస్తము కోలిపొయితి (2)          ||నిను||

నీ దివ్య ప్రేమను విడచి – నీ ఆత్మ తోడు త్రోసివేసి
అంధకార త్రోవలో నడచి – నీ గాయమే రేపితిని (2)
అయినా అదే ప్రేమ – నను చేర్చుకున్నప్రేమ
నను వీడని కరుణ – మరువలేనయ్యా యేసయ్యా        ||నీతో||

నను హత్తుకున్న ప్రేమ – నను చేర్చుకున్న ప్రేమ
నీ వెలుగులోనే నిత్యం – నే నడిచెదన్ (2)
నను విడువకు ప్రియుడా – నాకు తోడుగా నడువు
నీతోనే నా బ్రతుకు – సాగింతును యేసయ్యా          ||నిను||

English Lyrics

Audio

కనురెప్ప పాటైన

పాట రచయిత: గుంటూరు రాజా
Lyricist: Guntur Raja

Telugu Lyrics


కనురెప్ప పాటైన కను మూయలేదు – ప్రేమ ప్రేమ ప్రేమ
నిరుపేద స్థితిలోను నను దాటిపోలేదు – ప్రేమ ప్రేమ ప్రేమ (2)
పగలూ రేయి పలకరిస్తోంది
పరమును విడిచి నను వరియించింది (2)
కలవరిస్తోంది ప్రేమా
ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ        ||కనురెప్ప||

ప్రేమ చేతిలో నను చెక్కుకున్నది
ప్రేమ రూపుతో నను మార్చియున్నది (2)
ప్రేమను మించిన దైవం లేదని
ప్రేమను కలిగి జీవించమని (2)
ఎదురు చూస్తోంది ప్రేమా
కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ        ||కనురెప్ప||

ప్రేమ లోగిలికి నను పిలుచుచున్నది
ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది (2)
ప్రేమకు ప్రేమే తోడవుతుందని
ప్రేమకు సాటి లేనే లేదని (2)
పరవశిస్తోంది ప్రేమా
కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ         ||కనురెప్ప||

English Lyrics

Audio

HOME