మధురం మధురం నీ ప్రేమే

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


మధురం మధురం – నీ ప్రేమే అతి మధురం
అమరం అతి విజయం – నీ సిలువ రక్తమే విజయం
ఇమ్మానుయేలుడ నీ ప్రేమ మధురం – నీకే నా వందనం (2)
మధురం మధురం – నీ ప్రేమే అతి మధురం (2)        ||మధురం||

నా శిక్షకై నా నిందలకై – ప్రాణము పెట్టిన ప్రేమ
నిందలు నిట్టూర్పులు – సేదదీర్చిన ప్రేమ (2)
సర్వోన్నతుడా సహాయకుడా
మరువగలనా నీ ప్రేమను (2)        ||మధురం||

సత్యమును నాకు కేడెమును – ధరియింప చేసిన ప్రేమ
కనికరమును కలిగించగను – కల్వరికేగిన ప్రేమ (2)
మహోన్నతుడా మహా ఘనుడా
మరువగలనా నీ ప్రేమను (2)        ||మధురం||

English Lyrics

Audio

ప్రార్ధన విన్నావయ్యా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ప్రార్ధన విన్నావయ్యా – విజయం నిచ్చావయ్యా (2)
తొట్రిల్ల నియ్యలేదు – తోడుండి నడిపించావు (2)
పొగడెద పాటపాడి – పెనుతుఫానాగిపోయె
పరవశించి పాడెదా (2)
తండ్రి దేవా మంచివాడా – నిరంతరం గొప్పవాడా (2)
నిరంతరం గొప్పవాడా (2)

కన్నీరు చూసావయ్యా – కరం పట్టి నడిపావయ్యా (2)
విన్నపం విన్నావయ్యా – విడుదల నిచ్చావయ్యా (2)      ||పొగడెద||

ఎబినేజర్ నీవేనయ్యా – సహాయం చేసావయ్యా (2)
ఎల్రోయి నీవేనయ్యా – నన్నిల చూసావయ్యా (2)      ||పొగడెద||

నిన్నే నమ్ముకొనెదన్ – నీపై ఆనుకొనెదన్ (2)
శాంతి నొసగువాడా – నీ సన్నిధి చాలునయ్యా (2)      ||పొగడెద||

English Lyrics

Audio

HOME