కనలేని కనులేలనయ్యా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

కనలేని కనులేలనయ్యా
వినలేని చెవులేలనయ్యా
నిను చూడ మనసాయెనయ్యా యేసయ్యా

ఆకలిగొన్న యేసయ్యా నాకై ఆహారముగా మారావు గదయ్యా (2)
అట్టి జీవాహారమైన నిన్ను చూడ లేనట్టి కనులేలనయ్యా            ||కనలేని||

దాహము గొన్న ఓ యేసయ్యా జీవ జలములు నాకిచ్చినావు గదయ్యా (2)
అట్టి జీవాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా            ||కనలేని||

మరణించావు యేసయ్యా మరణించి నన్ను లేపావుగదయ్యా (2)
అట్టి మరణాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా            ||కనలేని||

రాజ్యమును విడిచిన యేసయ్యా నిత్య రాజ్యము నాకిచ్చావుగదయ్యా (2)
అట్టి రాజులకు రాజైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా            ||కనలేని||

అభ్యంతర పరచేటి కన్ను కలిగి అగ్నిలో మండేకన్నా (2)
ఆ కన్నే లేకుండుటయే మేలు నాకు నిను చూసే కన్నియ్య వేసయ్యా            ||కనలేని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

కనులున్నా కానలేని

పాట రచయిత: పి సతీష్ కుమార్
Lyricist: P Satish Kumar

Telugu Lyrics


కనులున్నా కానలేని చెవులున్నా వినలేని (2)
మనసున్నా మతిలేని స్తితియున్నా గతిలేని (2)
వాడను యేసయ్యా
ఓడిపోయిన వాడను (2)         ||కనులున్నా||

అన్ని ఉన్నా ఏమిలేని అందరు ఉన్న ఏకాకిని
దారి ఉన్నా కానరాని చెంతనున్నా చేరలేని
యేసయ్యా నన్ను విడువకయ్యా (2)
దిక్కులేని వాడను
వాడను యేసయ్యా
చెదరిపోయిన గూడును (2)      ||కనులున్నా||

భాషలున్నా భావములేని ఆత్మ ఉన్నా అవివేకిని
భక్తి ఉన్నా శక్తిలేని ప్రార్థన ఉన్నా ప్రేమలేని
యేసయ్యా నన్ను కరుణించుమా (2)
ఫలములేని వాడను
వాసిని యేసయ్యా
పేరుకు మాత్రమే విశ్వాసిని (2)     ||కనులున్నా||

బోధ ఉన్నా బ్రతుకులేని
పిలుపు ఉన్నా ప్రయాసపడని
సేవ ఉన్నా సాక్ష్యములేని
సంఘము ఉన్నా ఆత్మలులేని
యేసయ్యా నన్ను నింపుమయ్యా (2)
ఆత్మలేని వాడను
పాదిరిని యేసయ్యా
మాదిరి లేని కాపరిని (2)          ||కనులున్నా||

English Lyrics

Audio

HOME