అపరాధిని యేసయ్యా

పాట రచయిత: సిరిపురపు కృపానందము
Lyricist: Siripurapu Krupaanandamu

Telugu Lyrics

అపరాధిని యేసయ్యా
కృపజూపి బ్రోవుమయ్యా (2)
నెపమెంచకయె నీ కృపలో
నపరాధములను క్షమించు (2)

సిలువకు నిను నే గొట్టి
తులువలతో జేరితిని (2)
కలుషంబులను మోపితిని
దోషుండ నేను ప్రభువా (2)

ప్రక్కలో బల్లెపుపోటు
గ్రక్కున పొడిచితి నేనే (2)
మిక్కిలి బాధించితిని
మక్కువ జూపితి వయ్యో (2)

ముళ్ళతో కిరీటంబు
నల్లి నీ శిరమున నిడితి (2)
నా వల్ల నేరమాయె
చల్లని దయగల తండ్రి (2)

దాహంబు గొనగా చేదు
చిరకను ద్రావ నిడితి (2)
ద్రోహుండనై జేసితినీ
దేహంబు గాయంబులను (2)

ఘోరంబుగా దూరితిని
నేరంబులను జేసితిని (2)
కౄరుండనై గొట్టితిని
ఘోరంపు పాపిని దేవా (2)

చిందితి రక్తము నాకై
పొందిన దెబ్బల చేత (2)
అపనిందలు మోపితినయ్యో
సందేహమేలనయ్యా (2)

శిక్షకు పాత్రుడనయ్యా
రక్షణ దెచ్చితివయ్యా (2)
అక్షయ భాగ్యము నియ్య
మోక్షంబు జూపితివయ్యా (2)

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఎంత మంచి దేవుడవయ్యా

పాట రచయిత: దియ్యా ప్రసాదరావు
Lyricist: Diyya Prasada Rao

Telugu Lyrics

ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా
చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన
నా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన (2)

సంతోషం ఎక్కడ ఉందనీ
సమాధానం ఎచ్చట నాకు దొరికేననీ (2)
జగమంతా వెదికాను జనులందరినడిగాను (2)
చివరికది నీలోనే కనుగొన్నాను (2)           ||ఎంత మంచి||

ప్రేమనేది ఎక్కడ ఉందనీ
క్షమనేది ఎచ్చట నాకు దొరికేననీ (2)
బంధువులలో వెదికాను స్నేహితులను అడిగాను (2)
చివరికది నీలోనే కనుగొన్నాను (2)          ||ఎంత మంచి||

సత్యమనేది ఎక్కడ ఉందనీ
నిత్యజీవం ఎచ్చట నాకు దొరికేననీ (2)
ఎందరికో మొక్కాను ఏవేవో చేసాను (2)
చివరికది నీలోనే కనుగొన్నాను (2)         ||ఎంత మంచి||

English Lyrics

Audio

నజరేయుడా నా యేసయ్య

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics


నజరేయుడా నా యేసయ్య
ఎన్ని యుగాలకైనా
ఆరాధ్య దైవము నీవేనని
గళమెత్తి నీ కీర్తి నే చాటెద          ||నజరేయుడా||

ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి (2)
శూన్యములో ఈ భూమిని
వ్రేలాడదీసిన నా యేసయ్య (2)
నీకే వందనం నీకే వందనం (2)       ||నజరేయుడా||

అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి (2)
జలములలోబడి నే వెళ్ళినా
నన్నేమి చేయవు నా యేసయ్యా (2)
నీకే వందనం నీకే వందనం (2)        ||నజరేయుడా||

సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా (2)
సీయోనులో నిను చూడాలని
ఆశతో ఉన్నాను నా యేసయ్యా (2)
నీకే వందనం నీకే వందనం (2)        ||నజరేయుడా||

English Lyrics

Audio

నిను చూసే కన్నులు

పాట రచయిత: పి సతీష్ కుమార్
Lyricist: P Satish Kumar

Telugu Lyrics

నిను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా
నిను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా (2)
నిను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా (2)
నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా          ||నిను చూసే||

కన్నీటి ప్రార్థన నాకు నేర్పయ్యా
ఆత్మల సంపద నాకు ఇవ్వయ్యా (2)
నీ కొరకే జీవించే సాక్షిగా మార్చయ్యా
నాలోనే నిను చూపే మదిరినివ్వయ్యా               ||నిను చూసే||

అందరితో సఖ్యత ఇమ్ము యేసయ్యా
మృదువైన మాటతీరు నాకు ఇవ్వయ్యా (2)
కోపతాపములు దూరపరచయ్యా
అందరిని క్షమియించే మనస్సునివ్వయ్యా          ||నిను చూసే||

English Lyrics

Audio

నీ చేతిలో రొట్టెను

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

నీ చేతిలో రొట్టెను నేనయ్య విరువు యేసయ్యా (2)
విరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా (2)       ||నీ చేతిలో||

తండ్రి ఇంటినుండి పిలిచితివి అబ్రామును
ఆశీర్వదించితివి అబ్రహాముగా మార్చితివి (2)           ||నీ చేతిలో||

అల యాకోబును నీవు పిలిచితివి ఆనాడు
ఆశీర్వదించితివి ఇశ్రాయేలుగా మార్చితివి (2)           ||నీ చేతిలో||

హింసకుడు దూషకుడు హానికరుడైన
సౌలును విరిచితివి పౌలుగా మార్చితివి (2)              ||నీ చేతిలో||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

HOME