నే యేసుని వెలుగులో

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

నే యేసుని వెలుగులో నడిచెదను
రాత్రింబగలాయనతో నడిచెదను
వెల్గున్ నడిచెదను – వెంబడిచెదను
యేసుడే నా రక్షకుడు

నడిచెద నే ప్రభు యేసునితో
నడిచెద నే ప్రభు హస్తముతో
కాంతిలో నుండగ జయగాంతును
యేసునే నే వెంబడింతును

నే యేసుని వెలుగులో నడిచెదను
గాడంబగు చీకటిలో భయపడను
ఆత్మతో పాడుచు సాగిపోవుదును
యేసుడే నా ప్రియుండు         ||నడిచెద||

నే యేసుని వెలుగులో నడిచెదను
వెల్గులో ప్రభు స్వరము నే వినుచుందును
సర్వమిచ్చెదను చెంతనుండెదను
యేసుడే ప్రేమామయుడు         ||నడిచెద||

నే యేసుని వెలుగులో నడిచెదను
దిన సహాయము నే పొందెదను
సుఖ దుఃఖమైన మరణంబైన
యేసుడే నా యండనుండును         ||నడిచెద||

నే యేసుని వెలుగులో నడిచెదను
నా దృష్టిని ప్రభుపై నుంచెదను
సిల్వ ధ్వజమునే బట్టి వెళ్లెదను
యేసుడే నా చెంత నుండును         ||నడిచెద||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

నే సాగెద యేసునితో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

నే సాగెద యేసునితో
నా జీవిత కాలమంతా (2)

యేసుతో గడిపెద యేసుతో నడిచెద (2)
పరమును చేరగ నే వెళ్లెద (2)
హనోకు వలె సాగెదా            ||నే సాగెద||

వెనుక శత్రువులు వెంటాడిననూ (2)
ముందు సముద్రము ఎదురొచ్చినా (2)
మోషె వలె సాగెదా             ||నే సాగెద||

లోకపు శ్రమలు నన్నెదిరించినా (2)
కఠినులు రాళ్ళతో హింసించినా (2)
స్తెఫను వలె సాగెదా            ||నే సాగెద||

బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే (2)
క్రీస్తుకై హత సాక్షిగా మారిన (2)
పౌలు వలె సాగెదా             ||నే సాగెద||

తల్లి మరచిన తండ్రి విడచిన (2)
బంధువులే నన్ను వెలివేసినా (2)
బలవంతుని వలె సాగెదా    ||నే సాగెద||

English Lyrics

Audio

HOME