నీవుంటే నాకు చాలు యేసయ్యా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

నీవుంటే నాకు చాలు యేసయ్యా
నీవెంటే నేను ఉంటానేసయ్యా (2)
నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా
నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా (2)         ||నీవుంటే||

ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ
ఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ (2)          ||నీ మాట||

బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూ
అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా (2)    ||నీ మాట||

ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా
ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా (2)        ||నీ మాట||

నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము
నీదు కృపతో నాకేమియు కాదిల సమానము (2) ||నీ మాట||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

4 comments

  1. So much true, no person will come to help in tines of trouble, Only our savior and master will be there with us. Thank you for uploading this lyrics. May God bless you and keep you safe.

Leave a Reply

HOME