యేసే నా పరిహారి

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

యేసే నా పరిహారి
ప్రియ యేసే నా పరిహారి
నా జీవిత కాలమెల్ల
ప్రియ ప్రభువే నా పరిహారి (2)         ||యేసే నా||

ఎన్ని కష్టాలు కలిగిననూ
నన్ను కృంగించె భాదలెన్నో (2)
ఎన్ని నష్టాలు వాటిల్లినా
ప్రియ ప్రభువే నా పరిహారి (2)         ||యేసే నా||

నన్ను సాతాను వెంబడించినా
నన్ను శత్రువు ఎదిరించినా (2)
పలు నిందలు నను చుట్టినా
ప్రియ ప్రభువే నా పరిహారి (2)          ||యేసే నా||

మణి మాన్యాలు లేకున్ననూ
పలు వేదనలు వేధించినా (2)
నరులెల్లరు నను విడచినా
ప్రియ ప్రభువే నా పరిహారి (2)         ||యేసే నా||

బహు వ్యాధులు నను సోకినా
నాకు శాంతి కరువైనా (2)
నను శోధకుడు శోధించినా
ప్రియ ప్రభువే నా పరిహారి (2)          ||యేసే నా||

దేవా నీవే నా ఆధారం
నీ ప్రేమకు సాటెవ్వరూ (2)
నా జీవిత కాలమంతా
నిన్ను పాడి స్తుతించెదను (2)          ||యేసే నా||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

4 comments

Leave a Reply

HOME