ప్రార్థన శక్తి నాకు

పాట రచయిత:
Lyricist:

ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా
నీ పరలోక అభిషేకం కావాలయ్యా (2)
యేసయ్యా కావాలయ్యా
నీ ఆత్మ అభిషేకం కావలయ్యా (2)      || ప్రార్థన ||

ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి
నేను ప్రార్థింపగ దయచేయుమా (2)
ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా (2)
నిరంతరం ప్రార్థింప కృపనీయుమా (2)       || ప్రార్థన ||

సింహాల గుహలోని దానియేలు శక్తి
ఈ లోకంలో నాకు కావలయ్యా (2)
నీతో నడిచే వరమీయుమా (2)
నీ సిలువను మోసే కృపనీయుమా (2)       || ప్రార్థన ||

పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి
నే పాడు చోటెల్ల దిగిరా దేవా (2)
చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె (2)
ఈ చిన్న వాడిని అభిషేకించు (2)          || ప్రార్థన ||

Praardhana Shakthi Naaku Kaavaalayyaa
Nee Paraloka Abhishekam Kaavaalayyaa (2)
Yesayyaa Kaavaalayyaa
Nee Aathma Abhishekam Kaavaalayyaa (2)       || Praardhana ||

Eliyaa Praarthimpaga Pondina Shakthi
Nenu Praarthimpaga Dayacheyumaa (2)
Praarthinchi Ninu Cheru Baagyameeyumaa (2)
Nirantaram Praarthimpa Krupaneeyumaa (2)       || Praardhana ||

Simhaala Guhaloni Daaniyelu Shakthi
Ee Lokaml Naaku Kaavalayyaa (2)
Neeto Nadiche Varameeyumaa (2)
Nee Siluvanu Mose Krupaneeyumaa (2)      || Praardhana ||

Pethuru Praarthimpaga Nee Aathmanu Dimpithivi
Ne Paadu Chotella Digiraa Devaa (2)
Chinna Vayasulo Abhishekinchina Irmiyaa vale (2)
Ee Chinna Vaadini Abishekinchu (2)        || Praardhana ||

Download Lyrics as: PPT

 

FavoriteLoadingAdd to favorites

16 comments

Leave a Reply

%d bloggers like this: