ఒక వరమడిగితిని యేసయ్యా

పాట రచయిత: దీవెనయ్య
Lyricist: Deevenaiah

ఒక వరమడిగితిని యేసయ్యా
నీలా ఉండాలని – మండుచుండాలని
నీలా ఉండాలని – మండుచుండాలని (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)       ||ఒక వరమడిగితిని||

నాలో నేరము స్థాపించగలరా
ప్రతిధ్వని ఇచ్చెను నీ స్వరము ధరలో (2)
నన్ను పరిశుద్ధపరచి తుది శ్వాస వరకు
నీ మార్గములలో నడిపించవా (2)       ||ఒక వరమడిగితిని||

సర్వ సృష్టికి సర్వాధికారి
తల వాల్చుటకును స్థలమింత లేదా (2)
నేను లోకాశ విడచి పైనున్నవాటి
గురి కలిగి వెదకి పొందాలని (2)       ||ఒక వరమడిగితిని||

తండ్రిని విడచి పారమును వీడి
నన్ను సమీపించినావు (2)
నేను కలిగున్నదంత నీ పాదాల చెంత
అర్పించి నీ చెంత చేరాలని (2)       ||ఒక వరమడిగితిని||

దేవుని చిత్తము సంపూర్తి చేయగ
సిలువలో వ్రేళాడి శ్రమ నొందినావు (2)
నేను నీ సిలువ మోయుచు కడవరకు ఇలలో
నీ సాక్షిగా జీవించాలని (2)       ||ఒక వరమడిగితిని||

Oka Varamadigithini Yesayyaa
Neelaa Undaalani – Manduchundaalani
Neelaa Undaalani – Manduchundaalani (2)
Yesayyaa Yesayyaa Yesayyaa Yesayyaa (2)        ||Oka Varamadigithini||

Naalo Neramu Sthaapinchagalaraa
Prathidhvani Ichchenu Nee Swaramu Dharalo (2)
Nannu Parishudhdhaparachi Thudi Shwaasa Varaku
Nee Maargamulalo Nadipinchavaa (2)        ||Oka Varamadigithini||

Sarva Srushtiki Sarvaadhikaari
Thala Vaalchutakunu Sthalamintha Ledaa (2)
Nenu Lokaasha Vidachi Painunnavaati
Guri Kaligi Vedaki Pondaalani (2)        ||Oka Varamadigithini||

Thandrini Vidachi Paramunu Veedi
Nannu Sameepinchinaavu (2)
Nenu Kaligunnadantha Nee Paadaala Chentha
Arpinchi Nee Chentha Cheraalani (2)        ||Oka Varamadigithini||

Devuni Chiththamu Sampoorthi Cheyaga
Siluvalo Vrelaadi Shrama Nondinaavu (2)
Nenu Nee Siluva Moyuchu Kadavaraku Ilalo
Nee Saakshigaa Jeevinchaalani (2)        ||Oka Varamadigithini||

Download Lyrics as: PPT

FavoriteLoadingAdd to favorites

Leave a Reply